Begin typing your search above and press return to search.

కూటమి భారీ వ్యూహం : మండలి చైర్మన్ మీద అవిశ్వాస అస్త్రం ?

ఇలా చూసుకుంటే మరో రెండున్నరేళ్ళ కాలం మండలిలో వైసీపీకి ఎదురులేదు అని అంటున్నారు దాంతో కూటమి ప్రభుత్వానికి ఇది ఇబ్బందిగా ఉందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   19 March 2025 4:29 PM IST
కూటమి భారీ వ్యూహం : మండలి చైర్మన్ మీద అవిశ్వాస అస్త్రం ?
X

శాసనమండలిలో వైసీపీకి బలం ఉంది. అది మరో రెండున్నరేళ్ల పాటు అంటే 2027 వరకూ కొనసాగుతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాదికి దగ్గర అవుతోంది. మరో రెండున్నరేళ్ళు అంటే కూటమి పాలనలో పుణ్య కాలం అంతా ఇట్టే గడచిపోతోంది. ఏపీ అసెంబ్లీకి బాయ్ కాట్ చేసిన వైసీపీ తెలివిగా మండలిలో కూటమిని ఎదుర్కొంటోంది. ఇరుకున పెడుతోంది.

ఇక శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలకు మైకు సులువుగా దొరుకుతోంది. మండలి చైర్మన్ మోషెన్ రాజు వైసీపీ పార్టీకి చెందిన వారు. దాంతో వైసీపీకి మండలిలో దూకుడు చేసేందుకు చాన్స్ బాగా దక్కుతోంది. మరో వైపు చూస్తే మోషెన్ రాజు పదవీ కాలం 2027 జూన్ 10 దాకా ఉంది.

ఇలా చూసుకుంటే మరో రెండున్నరేళ్ళ కాలం మండలిలో వైసీపీకి ఎదురులేదు అని అంటున్నారు దాంతో కూటమి ప్రభుత్వానికి ఇది ఇబ్బందిగా ఉందని అంటున్నారు. ఇక మండలిలో అయిదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు అయితే వారి రాజీనామాలు ఆమోదం పొందలేదు.

అది మండలి చైర్మన్ విచక్షణ మీద ఆధారపడి ఉంది. దాంతో ఆయనను ఎవరూ ఏ విధంగానూ ఒత్తిడి చేయలేరు. ఈ క్రమంలో మండలిలో అవకాశాలను అందుకుని రాజకీయంగా దూకుడు చేయాలంటే ఏకంగా చైర్మన్ మీదనే అవిశ్వాసం పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో కూటమి పెద్దలు ఉన్నారని అంటున్నారు.

దానికి కారణం వైసీపీలో చాలా మంది ఎమ్మెల్సీలు గట్టు దాటి కూటమిలో చేరాలని చూస్తున్నారుట. వారు రాజీనామాలు చేసే ఆమోదం పొందే చాన్స్ లేదు దాంతో అవిశ్వాసం పెడితే వారంతా అనుకూలంగా ఓటు వేస్తారు అన్న లెక్కలేవో కూటమి పెద్దల వద్ద ఉన్నాయని అంటున్నారు.

మొత్తం 58 మంది సభ్యులు ఉండే మండలిలో అవిశ్వాస తీర్మానం నెగ్గాలీ అంటే 30 మంది మెంబర్ల మద్దతు ఉండాలి. కూటమికి 15 మంది దాకా సభ్యుల బలం ఉంది. అయిదురుగు వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల బలం కూడా కలుస్తుంది అనుకుంటున్నారు. మరో అయిదారుగురు వైసీపీ నుంచి అజ్ఞాత సాయం చేస్తారని భావిస్తున్నారు. ఇక ఇతర సభ్యుల నుంచి మరో అయిదురుగు మద్దతు సాధిస్తే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని భావిస్తున్నారు.

ఆ విధనా ప్రస్తుతం ఉన్న చైర్మన్ ని దించి తమ వారిని గద్దెనెక్కిస్తే మండలిలో వైసీపీకి గట్టి షాక్ తగులుతుందని కూటమి పెద్దలు భావిస్తున్నారుట. ఇక వైసీపీ నుంచి ఎంత మంది వస్తే అంత మందిని చేర్చుకోవడం ద్వారా మండలిలో పోస్టులు అన్నీ ఖాళీ చేయించుకుని తమ వారితో నింపుకోవడానికి కూడా చూస్తున్నారు అని అంటున్నారు.

అయితే ఈ ప్లాన్ బ్రహ్మాండంగా ఉన్నా ఆచరణలో ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది. వైసీపీ విప్ జారీ చేస్తుంది. దానిని ధిక్కరించిన వారి మీద మండలి చైర్మన్ వేటు వేస్తారు. అపుడు సభ్యత్వం పోతుంది. అయితే అన్నింటికీ సిద్ధపడే కూటమి పెట్టే అవిశ్వాసానికి ఓటు వేయాలని అనుకుంటే కనుక ఆపేది ఏమీ లేదు. మొత్తానికి శాసనమండలి వేదికగా కొత్త రాజకీయాన్ని చూపించేందుకు కూటమి రెడీ అవుతోంది అని ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఇందులో నిజమెంత ఉందో.