Begin typing your search above and press return to search.

కూటమిని కాసుకోవడం వైసీపీకి కష్టమేనా ?

ఏపీలో వివిధ స్థానిక సంస్థలలో డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్ పర్సన్ వంటి పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి.

By:  Tupaki Desk   |   2 Feb 2025 7:30 PM GMT
కూటమిని కాసుకోవడం వైసీపీకి కష్టమేనా ?
X

ఏపీలో వివిధ స్థానిక సంస్థలలో డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్ పర్సన్ వంటి పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ విధంగా చూస్తే దీనిని మినీ లోకల్ ఫైటింగ్ గానే చూడాలని అంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ లోకల్ బాడీస్ లో ఈ పోస్టులు వివిధ కారణాల వల్ల ఖాళీ అయ్యాయి.

దాంతో వీటి భర్తీకి ఎన్నికలను నిర్వహిస్తున్నారు. మరి ఈ పదవులను పూర్తి స్థాయిలో అందుకోవడానికి మూడు పార్టీలతో కూడిన కూటమి గట్టి పట్టుదలతో ఉంది. నిజానికి కూటమిలో చేరేందుకే చాలా మంది తాము వైసీపీ తరఫున అనుభవిస్తున్న డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్మన్ పదవులకు రాజీనామాలు చేశారని అంటున్నారు.

ఇక ఈ పదవులు పొందడం అంటే అంకెల గారడీ మీదనే ఆధారపడి ఉంటుంది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఏపీలో నూటికి తొంబై శాతం కార్పోరేషన్లు, మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది. అయితే అనూహ్యంగా వైసీపీ అధికారం నుంచి దిగిపోయి ఘోర ఓటమిని మూటకట్టుకోవడం తో వైసీపీలో ఉన్న చాలా మంది ప్లేట్ ఫిరాయించారు. అంతే కాదు అనేక మంది ప్రలోభాలకు గురి అయ్యారని అంటున్నారు

వాటి ఫలితమే ఈ ఎన్నికలు అని చెబుతున్నారు. మరి ఈ ఎన్నికలు వచ్చిన కారణం తెలిస్తే సోమవరం జరిగే ఎన్నికలలో ఫలితాలు ఏ తీరున ఉంటాయన్నది కూడా చెప్పవచ్చు అని అంటున్నారు. ఇక చూస్తే సోమవారం ఏపీలోని ఏలూరు, తిరుపతి, నెల్లూరు కార్పోరేషన్లకు డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. నందిగామ హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీలలో చైర్ పర్సన్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. బుచ్చిరెడ్డిపాలేం, నూజివీడు, తుని పిడుగురాళ్ళ మున్సిపాలిటీలకు వైస్ చైర్ పర్సన్ లకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ విధంగా మినీ ఎన్నికల సమరం స్టార్ట్ అయింది. ఈ పదవులు మొత్తం నూరు శాతం గెలుచుకోవడానికి కూటమి పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా ఏడాదికి పైగా అధికారం స్థానిక సంస్థలకు ఉండడంతో కూటమికి మద్దతు ఇవ్వడం ద్వారా రాజకీయంగా బాగుపడవచ్చు అన్న ఆలోచన కూడా వైసీపీ నేతలు కొందరిలో ఉందని అంటున్నారు.

దీంతో కార్పోరేటర్లు కౌన్సిలర్లకు చాలా చోట్ల ప్రలోభాలకు తెర తీశారు అని వార్తలు వస్తున్నాయి. అంతే కాదు అధికారంలో ఉంది కూటమి కాబట్టి వైసీపీ నేతల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి పడుతోంది. దాంతో వైసీపీకి కూటమి దూకుడుని వ్యూహాలను కాసుకోవడం పెను సవాల్ గా మారుతోంది.

ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో చూస్తే కనుక వైసీపీకి ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారనున్నాయని అంటున్నారు. టోటల్ గా అన్ని పదవులూ గెలుచుకుని కూటమి పార్టీకు రాజకీయంగా వైసీపీకి గట్టి దెబ్బ కొట్టాలని చూస్తున్నాయి. దాంతో వైసీపీ తన చేతిలో ఉన్న అధికారాన్ని ప్రయోగించింది. కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు విప్ ని జారీ చేసింది.

విప్ ని ధిక్కరిస్తే వారు పదవులు కోల్పోతారు కాబట్టి తన చేతిలో ఉన్న అస్త్రాన్ని ఈ విధంగా వైసీపీ తీసింది. అయితే ఈ కార్పోరేషన్లు, మునిసిపాలిటీలలో అధికార మార్పిడి జరిగితే వైసీపీ కార్పోరేటర్లు కౌన్సిలర్లు విప్ ని ధిక్కరించినా వారికి రక్షణ ఉంటుందని కూడా ప్రచారం సాగుతోంది. దాంతో చాలా మంది ఈ విప్ ని ఎంతవరకూ అతిక్రమించకుండా పార్టీ నిర్ణయాలకు విధానాలకు కట్టుబడి ఉంటారు అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా ఈ మండే వైసీపీ పాలిట రాజకీయంగా మండించే డేగా మారుతుందా అన్న చర్చ అయితే ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.