కేశినేని నానీకి ... చిన్నీకి తేడా తెలియదా.. షాకింగ్ న్యూస్...!
విజయవాడ ఎంపీ పరిధిలోనూ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇదే చిత్రమై న ఘటన చోటు చేసుకుందని తాజాగా వెలుగు చూసింది.
By: Tupaki Desk | 6 Dec 2024 12:30 PM GMTరాజకీయాల్లో ఒక్కొక్కసారి గమ్మత్తులు జరుగుతూ ఉంటాయి. వాటిని తెలుసుకున్నాక.. అందరూ ఏమీ చేయలేక మౌనం వహించడమే. విజయవాడ ఎంపీ పరిధిలోనూ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఇదే చిత్రమై న ఘటన చోటు చేసుకుందని తాజాగా వెలుగు చూసింది. విజయవాడ ఎంపీగా ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కేశినేని శివనాథ్.. ఉరఫ్ చిన్నీ విజయం దక్కించుకున్నారు. తన సోదరుడు కేశినేని నాని పోటీ చేసినా.. ఆయనకు బాగా కలిసి వచ్చింది.
టీడీపీ తరఫున కేశినేని శివనాథ్ పోటీ చేసిన విషయం తెలిసింది. దీనికి సంబంధించి దాదాపు రెండేళ్ల పాటు శివనాథ్ గ్రౌండ్ వర్క్ బాగానే చేశారు. ఇది ఆయనకు విజయం దక్కించిందనే టాక్ ఉంది. ఈ విషయంలో ఎలాంటి తేడా లేకపోయినా.. తాజాగా విజయవాడ పార్లమెంటు పరిదిలోని పలు గ్రామాల్లో తాజాగా శివనాథ్ వర్గీయులు పర్యటించారు. ఎంపీ లాడ్స్ కింద పనులు చేపట్టేందుకు అక్కడి వారితో చర్చించారు. అయితే.. ఇక్కడే చిత్రమైన విషయం వెలుగు చూసింది.
గ్రామీణ ప్రాతాల్లో గతంలో రెండు దఫాలు ఎంపీగా పనిచేసిన కేశినేని నాని.. గ్రామీణులకు కొట్టిన పిండిగా మారిపోయారు. ఆయన పేరు, పార్టీ కూడా .. గ్రామీణుల్లో డైజెస్ట్ అయిపోయింది. నాని అంటే మైలవరం, తిరువూరు, నందిగామ తదితర నియోజకవర్గాల్లోని గ్రామాల్లో పెద్ద ఫాలోయింగ్ కూడా ఉంది. ఆయన పేరు చెబితే చాలు.. పనులు మానుకుని కూడా.. వచ్చి కలుసుకుంటారు. టాటా ట్రస్టుతో కలిసి నాని చేసిన అభివృద్ధి పనులే దీనికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతారు.
అయితే.. ఈ ఏడాది ఎన్నికల్లో కూడా.. నానికే ఓటు వేశామని.. చిన్ని ఎవరో తమకు తెలియదని మైలవరం నియోజకవర్గంలోని రెండు మూడు గ్రామాల ప్రజలు చెప్పడం చిత్రంగా మారింది. నాని టీడీపీ నుంచి వైసీపీలోకి మారిన సంగతి కానీ.. ఆయన వైసీపీ గుర్తుపై పోటీ చేసిన సంగతి కానీ.. తమకు తెలియదని.. ఆయన టీడీపీలోనే ఉన్నారని భావించి ఓటేశామని వందల మంది గ్రామీణులు చెప్పారు.
తాజాగా పనులు చేసేందుకు అక్కడకు వెళ్లిన చిన్ని వర్గం.. ఈ సమాచారంతో ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. ఇది వారికే కాదు.. రాజకీయ విశ్లేషకులకు కూడా మింగుడుపడడం లేదు. చివరి నిముషంలో పార్టీ మారడంతో ప్రజల్లోకి నాని ఏ గుర్తుపై పోటీ చేస్తున్నారన్న డిఫరెన్స్ తెలియలేదన్న విశ్లేషణలు వస్తున్నాయి. అయితే.. నానీ ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.