Begin typing your search above and press return to search.

ఏపీలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. సీన్ ఇలా మారుతుందా..?

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అసలు ఎవరు గెలుస్తారు? అనేది ఆసక్తిగా మారింది.

By:  Tupaki Desk   |   1 Oct 2024 8:30 PM GMT
ఏపీలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే.. సీన్ ఇలా మారుతుందా..?
X

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అసలు ఎవరు గెలుస్తారు? అనేది ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగి నాలుగో నెల గడిచిపోయింది. ప్రభుత్వం ఏర్పడి కూడా 100 రోజులు పూర్తయ్యాయి. అయితే సామాన్యుల ఆలోచన వేరే విధంగా ఉంది. వైసీపీ గనక మళ్ళీ వచ్చుంటే తమ‌కు అమ్మ ఒడి సహా ఇతర కీలక పథకాలు అందుండేవని మెజారిటీ సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఆన్లైన్ ఛానల్ నిర్వ‌హించిన‌ సర్వేలో ఇదే విషయం వెలుగు చూసింది.

అమ్మ ఒడి, వైయస్సార్ రైతు భరోసా, విద్యా కానుక అదేవిధంగా ఆసరా వంటి కీలక పథకాలు అమలై ఉండేవని ఎక్కువమంది అభిప్రాయం వ్యక్తం చేయటం గమనార్హం. ఇక గడిచిన వంద రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని గమనిస్తే వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ఏ వ్యవస్థ కూడా గాడిలో పడినట్టుగా కనిపించడం లేదు. తరచుగా అధికారులను మారుస్తున్నారు. బదిలీ చేస్తున్నారు. ఇది ప్రభుత్వంలో రొటీన్ గా జరిగే ప్రక్రియ అయినప్పటికీ గడిచిన మూడు నెలల్లో ఎక్కువ మంది అధికారులు మార్చడం పైనే కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఇక సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన వాటిని ఇప్పటివరకు ప్రకటించకపోవడం కూడా చ‌ర్చ‌నీయాంశం అయింది. అమలు చేస్తున్న పింఛన్ పథకం ఒకటి మాత్రమే కనిపిస్తుండటం ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిరాశగా మారింది. ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళలకు నెలకు 1500 రూపాయలు చొప్పున ఇస్తానన్న ఆడబిడ్డ నిధి, అదే విధంగా రైతులకు ఇస్తానన్న 20వేల రూపాయల అమౌంట్ వంటివి ఇప్పటికీ సందేహంగానే ఉన్నాయి.

మరోవైపు రాజకీయంగా ప్రతి విషయాన్నీ విమర్శలు చేయటం వంటివి కూడా ఓటమి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం అవడానికి కారణంగా మారుతోంది. అయితే వైసిపి పరిస్థితి కూడా ఎన్నికల తర్వాత పెద్దగా మెరుగుపడింది లేదు. కీలకమైన నాయకులు పార్టీ మారిపోతుండడం, జగన్ జనంలోకి రాకపోవడం, తిరుమల శ్రీవారిని అపవిత్రం చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడం, గత ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేసిందన్న ప్రచారం వంటివి ఆ పార్టీకి ఇంకా దిద్దుకోలేని సమస్యలుగానే మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో కూటమి సర్కారుపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ వైసీపీ వైపు జనాలు పెద్దగా మొగ్గుచూపున టువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక విజయవాడ వరదలకు సంబంధించి 50 వేల కుటుంబాలు సుమారుగా ఇబ్బందులు పాలయ్యాయి. వీరికి ఇస్తానన్న నష్ట పరిహారం విషయంలో ప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించింది. అది కూడా సక్రమంగా పంపిణీ జరగడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కొంత మందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం తీవ్ర అసంతృప్తికి ఆవేదనకు కారణాలుగా మారుతున్నాయి.

ఇది కూడా ప్రభుత్వం పై ప్రభావం చూపించే అంశం. ఇక వ్యక్తిగతంగా చూసుకుంటే చంద్రబాబుకు గతంలో ఉన్న ఇమేజ్ అలాగే ఉంది. ఇప్పుడు ఈ మూడు మాసాల్లో పెరిగింది ఏమీ కనిపించట్లేదు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన త‌ర్వాత ఒక పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు దిశగా మాత్రమే ఆయన అడుగులు వేస్తున్నారు. ఇతర విషయాలను జోక్యం చేసుకోకపోవడం, ఇతర విషయాల్లో స్పందించకపోవడం వంటివి ఆయనకి మైనస్ గా మారాయి.

తిరుమల లడ్డు విషయంలో ప‌వ‌న్‌ అతిగా స్పందించారని మెజారిటీ ప్రజలు, మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. విషయాన్ని విషయంగా చూడకుండా దాన్ని రాజకీయం చేయాలన్న అభిప్రాయంతో అడుగులు వేశారనేది మెజారిటీ అభిప్రాయంగా స్పష్టం అవుతుంది. ఇక మంత్రుల విషయానికొస్తే చంద్రబాబు చెప్పింది చేస్తున్నారు లేకపోతే సైలెంట్ గా ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు యధావిధిగానే కొనసాగుతున్నాయి.

ఈ ప్రణామాలన్నీ గమనిస్తే సామాన్యుల ఆలోచన ధరణి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మొగ్గు చూపే అవకాశం లేనట్టుగానే కనిపిస్తుంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వానికి 164 ఎమ్మెల్యేలు దక్కారు. కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఇది 100 లోపే ఉంటుందన్నది ప్రధానంగా వినిపిస్తున్న మాట. బిజెపి విషయానికి వస్తే అసలు ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు గాని జనంలో ఎక్కడా కనిపించకపోవడం వారి మాటే వినిపించకపోవడం ఎంతైనా చర్చనీయాంశంగా మారింది.