Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... వల్లభనేని వంశీ అరెస్ట్!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   13 Feb 2025 4:29 AM GMT
బిగ్ బ్రేకింగ్... వల్లభనేని వంశీ అరెస్ట్!
X

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. అనంతరం.. ఆయనను విజయవాడ తరలిస్తున్నారు. ఈ సందర్భంగా... బీ.ఎన్.ఎస్. సెక్షన్ 140(1), 308, 351(3) రెడ్‌ విత్‌ 3(5) కింద కేసులు నమోదు చేసినట్టు చెబుతున్నారు.


అవును... గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా... వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పోలీసులు నమోదు చేశారని తెలుస్తోంది. ఇదే సమయంలో కిడ్నాప్‌, దాడి కేసుల్లో అరెస్ట్‌ చేస్తున్నట్టు వంశీ భార్యకు పోలీసులు నోటీసుల్లో తెలిపారు.


ఈ సందర్భంగా... వంశీని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. ఇది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా... గన్నవరం టీడీపీ ఆఫీస్‌ పై దాడి కేసులోనే వంశీని అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు.

మరోపక్క.. ఈ అరెస్ట్ ను వైసీపీ ఖండించింది. దీన్ని.. కూటమి సర్కార్ కక్ష సాధింపుచర్యగా అభివర్ణించింది. ఇందులో భాగంగా... మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారని.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ లో ఉన్నారని తెలిపింది.

ఇటీవల టీడీపీ ఆఫీస్ పై దాడి ఫిర్యాదును సత్యవర్థన్ వెనక్కి తీసుకున్నాడని తెలిపింది. అయినప్పటికీ వంశీని కూటమి నేతలు టార్గెట్ చేశారని.. మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపింది. ఈ సందర్భంగా... ఈ కక్ష పూరిత రాజకీయాలు ఇంకెన్నాళ్లు చంద్రబాబు అని ఎక్స్ వేదికగా వైసీపీ ప్రశ్నించింది.

కాగా… గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరైన ఫిర్యాదుదారుడు సత్యవర్థన్.. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని అఫిడవిట్ సమర్పించారు.