Begin typing your search above and press return to search.

నెట్టింట అభినందనలు... హోంమంత్రి అనిత సంచలన వీడియో!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాస్త టెక్నాలజీని ఎక్కువగా వాడుతూ ప్రజాసేవలో దూసుకుపోతుందనే విషయంపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 March 2025 9:07 AM
నెట్టింట అభినందనలు... హోంమంత్రి అనిత సంచలన వీడియో!
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాస్త టెక్నాలజీని ఎక్కువగా వాడుతూ ప్రజాసేవలో దూసుకుపోతుందనే విషయంపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ మొదలవ్వగా... డ్రోన్ లను పోలీసులు పక్కాగా యూజ్ చేసుకుంటున్నారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అవును... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తాజాగా ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సంచలనంగా మారిందనే చెప్పాలి. గతంలో పెద్దగా ఎన్నడూ చూడని విషయం ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో వెలుగుచూడటంతో విషయం వైరల్ గా మారింది. కామెంట్ సెక్షన్ లో నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తాజాగా ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా... ఏపీ పోలీస్ శాఖలో డ్రోన్ టెక్నాలజీని ఎంత కీలకంగా ఉపయోగిస్తున్నారనే విషయంపై ఆసక్తికర పోస్ట్ పెట్టారు. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్.. అన్న నినాదానికి అర్ధం చెప్పిన ఘటన ఇది అని పేర్కొన్నారు.

ఇదే సమయంలో... ఎవరికీ దొరక్కుండా లారీలో పేకాడుతున్న వారిని విజయనగరం పోలీసులు డ్రోన్ సాయంతో గుర్తించి అరెస్ట్ చేశారని.. టెక్నాలజీతో నేరాలను నియంత్రిస్తున్న పోలీసులకు అభినందనలు అని ఈ సందర్భంగా హోంమంత్రి.. విజయనగరం జిల్లా పోలీసులను అభినందించారు.

చంద్రబాబు నాయుడు, లోకేష్ లను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసిన ఈ వీడియోలో... విజయనగరం జిల్లాలో ఓ ప్రాంతంలో.. లారీలను పార్క్ చేసి, దానిపై కూర్చిని పలువురు పేకాట ఆడుతున్నారు. ఈ సమయంలో తమ కళ్లు గప్పి పేకాట ఆడుతుండగా... డ్రోన్ కెమెరాల సాయంతో గుర్తించిన పోలీసులు.. వాహనంలో అక్కడకు చేరుకుని, లారీ ఎక్కి వారిని చుట్టుముట్టారు.

ఈ నేపథ్యంలో... పోలీసులు చేసిన ఈ పనికి నెట్టింట ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ వీడియో చూసిన వారు పోలీసుల పనితీరును, కూటమి ప్రభుత్వ పెర్ఫార్మెన్స్ ను మెచ్చుకుంటున్నారు. ఇదే సమయంలో... మిగిలిన నేరాల విషయాల్లోనూ ఇదే స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటున్నారు.