Begin typing your search above and press return to search.

కొత్త డేట్ ఫిక్స్... ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల వాట్సప్ మెసేజ్!

అవును... ఇప్పటికే ఈ నెల 19న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు.. వాటికి వర్మ మెసేజ్ పెట్టి గైర్హాజరవ్వడంతో తాజాగా మరోసారి నోటీసులు పంపించారు.

By:  Tupaki Desk   |   20 Nov 2024 10:22 AM GMT
కొత్త డేట్  ఫిక్స్... ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల వాట్సప్  మెసేజ్!
X

ఒంగోలులో నమోదైన కేసు మేరకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మను విచారణకు రావాలంటూ ఏపీ పోలీసులు ఇటీవల ఒంగోలు నుంచి హైదరాబాద్ కు వచ్చి.. 19న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లడం.. అక్కడ చుక్కెదురవ్వడం తెలిసిందే. దీంతో.. ఒంగోలు రూరల్ పోలీసులకు వాట్సప్ మెసేజ్ పెట్టారు ఆర్జీవీ.

ఇందులో భాగంగా... తనకు షూటింగ్స్ లో బిజీ షెడ్యూల్ ఉందని.. తాను విచారణకు సహకరిస్తాను కానీ.. మరో నాలుగు రోజుల సమయం తనకు కావాలని మెసేజ్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో... ఆర్జీవీకి ఒంగోలు పోలీసులు వాట్సప్ మెసేజ్ పంపించారు.

అవును... ఇప్పటికే ఈ నెల 19న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు.. వాటికి వర్మ మెసేజ్ పెట్టి గైర్హాజరవ్వడంతో తాజాగా మరోసారి నోటీసులు పంపించారు. ఇందులో భాగంగా... ఈ నెల 25న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.

తనకు నాలుగు రోజులు సమయం కావాలంటూ వర్మ వాట్సప్ చేసిన నెంబర్ కే ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ ఈ నోటీసులు పంపించారు! దీంతో.. ఈ నెల 25న పోలీసులు విచారణ నిమిత్తం వర్మ ఒంగోలు ప్రయాణం తప్పకపోవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోపక్క... వర్మ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ నెల 21న విచారణ జరగొచ్చని అంటున్నారు.

కాగా.. ముందుగా నేరుగా అందించిన నోటీసుల ప్రకారం ఈ నెల 19న ఆర్జీవీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. వారం రోజులు గడువు కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అదే తేదీ ఉదయం సీఐకి వర్మ వాట్సప్ మెసేజ్ పెట్టగా.. తర్వాత ఆయన తరుపు న్యాయవాదులు ఒంగోలు రూరల్ పోలీసులను కలిసి సమాచారం ఇచ్చారు.