Begin typing your search above and press return to search.

అర్జెంట్... ఏపీ పోలీసుల సీరియస్ హెచ్చరిక!

ఇదే సమయంలో మృతులకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

By:  Tupaki Desk   |   9 Jan 2025 10:25 AM GMT
అర్జెంట్... ఏపీ పోలీసుల సీరియస్  హెచ్చరిక!
X

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి పెనువిషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారు. ఈ ఘటనపై సీఎం సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇదే సమయంలో మృతులకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

మరోపక్క... మృతులకు 2 కోట్ల రూపాయల వరకూ ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని.. క్షతగాత్రులకు రూ. 25 లక్షలు పరిహారం చెల్లించాలని వైసీపీ నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఈ ఘటనపై పలు వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా... తిరుపతి ఘటన సమయంలో ఓ అంబులెన్స్ డైవర్ ప్రవర్తన ఇది అంటూ ఓ పోస్ట్ వైరల్ గా మారింది.

ఇందులో భాగంగా... తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన తన 12 ఏళ్ల కుమారుడిని ముందుగా హాస్పటల్ కు తీసుకెళ్లమని కోరితే.. అందుకు అంబులెన్స్ డ్రైవర్ రూ.20 వేలు డిమాండ్ చేశాడని.. అయితే ఆ బాలుడి తండ్రి వద్ద అంత డబ్బు లేక సుమారు 90 కి.మీ. తీసుకుని వెళ్లాడని.. ఇది చాలా దారుణమని ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇలా తాజాగా జరిగిన తిరుపతి తొక్కిసలాట ఘటనకు ఏమాత్రం సంబంధం లేని పాత వీడియోలు ఇప్పుడు నెట్టింట తాజాగా దర్శనమిస్తూ.. మరోసారి వైరల్ అవుతున్నాయని అంటున్నారు. ప్రభుత్వంపై బురద జల్లడానికే ఇది కావాలని కొంతమంది చేస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో దీనిపై పోలీసులు స్పందించారు.

అవును... తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగిన నేపథ్యంలో నెట్టింట పలు పాత వీడియోలు ప్రచారంలోకి వస్తున్నాయని.. వాటిని నమ్మొద్దని.. అలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండటానికి ముందు వాస్తవాలను గ్రహించాలని తాము ప్రజలను కోరుతున్నట్లు ఏపీ పోలీస్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు.

ఇందులో భాగంగా... "అర్జెంట్: తిరుపతిలో జరిగిన తాజా తొక్కిసలాటకు సంబంధించిన ఫుటేజ్ లుగా పాత వీడియోలను తిరిగి ప్రసారం చేస్తున్నారు జాగ్రత్త.. ఈ స్పెషల్ వీడియో నిన్నటిది కాదు.. 2022లో తిరుపతిలో జరిగిన సంఘటనకు సంబంధించినది.. తప్పుడు సమాచరం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు వాస్తవాలను ధృవీకరించాలని మేము కోరుతున్నాము" అని పోస్ట్ చేశారు.