Begin typing your search above and press return to search.

అప్పుల విషయంలో ఆంధ్రుల్ని దేశంలో కొట్టేవారే లేరు.. షాకింగ్ గణాంకాలు!

ఇందులో భాగంగా... ఏపీలోని గ్రామీణ ప్రాంత మహిళలకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని.. ప్రతీ లక్ష మందిలో 64,953 మంది రుణగ్రస్తులే అని వెల్లడించింది.

By:  Tupaki Desk   |   3 Nov 2024 5:13 AM GMT
అప్పుల విషయంలో ఆంధ్రుల్ని దేశంలో  కొట్టేవారే లేరు.. షాకింగ్  గణాంకాలు!
X

తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారిలో ప్రతీ లక్ష మందికి 42,407 మందికి అప్పు ఉందని జాతీయ శాంపుల్ సర్వే సంస్థ (ఎ.ఎస్.ఎస్.వో) వెళ్లడించిన సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతల్లో వీరి సంఖ్య ప్రతీ లక్షమందిలో 50,289గా ఉండగా.. పట్టణాల్లో 31,309 గా ఉందని తెలిపింది. ఈ విషయంలో తాజాగా ఆంధ్రుల లెక్కలు తెరపైకి వచ్చాయి.

అవును... 18ఏళ్లు పైబడిన ప్రతీ లక్ష మంది జనాభాలో 60,092 (60%) మందికి అప్పులు ఉన్నాయని.. దేశంలోని మరే రాష్ట్రమూ ఈ విషయంలో ఆంధ్రులకు దరిదాపుల్లో లేదని.. జూలై 2022 - జూన్ 2023 మధ్య కేంద్ర గణాంకశాఖ నిర్వహించిన శాంపుల్ సర్వే (కాంప్రహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే 2022 - 23) వెల్లడించింది.

ఈ సందర్భంగా... దేశంలో సగటున లక్ష మందిలో 18,322 మంది మాత్రమే అప్పుల్లో ఉంటే.. ఏపీలో మాత్రం వారి సంఖ్య 228% అధికంగా.. 60,092 గా ఉందని నివేదిక తెలిపింది. ఇక ప్రధానంగా... పురుషులతో పోలిస్తే మహిళలపై రుణభారం ఎక్కువగా ఉందని.. ఈ విషయంలోనూ ఏపీ టాప్ ప్లేస్ లో ఉందని నివేదిక చెబుతోంది!

ఇందులో భాగంగా... ఏపీలోని గ్రామీణ ప్రాంత మహిళలకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని.. ప్రతీ లక్ష మందిలో 64,953 మంది రుణగ్రస్తులే అని వెల్లడించింది. పంజాబ్ గ్రామీణ ప్రాంతల్లో లక్ష మంది పురుషుల్లో 20,673 మందికి అప్పులుంటే.. మహిళల సంఖ్య 5,604 మంది మాత్రమే అప్పులు కలిగి ఉన్నారు.

ఇక రాజస్థాన్ లో ప్రతీ లక్ష మంది పురుషుల్లో 23,675 మందికి అప్పులు ఉంటే.. ప్రతీ లక్షమంది మహిళల్లోనూ 5,161 మందికి మాత్రమే అప్పులు ఉన్నాయి. ఇక ఒడిశాలో లక్షమంది పురుషుల్లో 20,722 మందికి అప్పులు ఉండగా.. మహిళల్లోనూ దాదాపు సమానంగా 20,593 మందికి అప్పులు ఉన్నాయి.

ఈ క్రమంలో... దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అప్పులున్న వారిలో దక్షిణాది రష్ట్రాలు తొలి ఐదు స్థానాల్లోనూ ఉండగా.. వాటిలో తొలి రెండు స్థానాల్లోనూ తెలుగు రాష్ట్రాలే నిలవడం గమనార్హం. వీటిలో ఏపీ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. తెలంగాణ సెకండ్ ప్లేస్ లో ఉంది.

ఇదే క్రమంలో... దేశంలో అత్యల్పంగా గోవాలో ప్రతీ లక్ష మంది జనాభాకు 2,317 మందికి మాత్రమే అప్పులు ఉండగా.. రాజధాని ఢిల్లీలో 8,249 మందికి, బీహార్ లో 9,899 మందికి, యూపీలో 11,844.. పంజాబ్ లో 11,941.. మహారాష్ట్రలో 12,258, రాజస్థాన్ లో 13,480.. ఒడిశాలో 19,956 మందికి అప్పులున్నాయని తాజా సర్వే తేల్చింది.