బీసీ ఆయుధం తో జగన్...?
వీక్ గా ఉన్న క్యాండిడేట్ల ప్లేస్ లో సామాజిక ప్రయోగం చేయడానికి వైసీపీ సిద్ధంగా ఉంది అని అంటున్నారు
By: Tupaki Desk | 3 Aug 2023 3:48 AM GMTజగన్ ఈసారి ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ ని మరింత పదునెక్కిస్తున్నారు అని అంటున్నారు. ఆయన 2019 ఎన్నికల్లో అభ్యర్ధులలో చాలా మందిని బీసీలతో పాటు ఇతర కులాల వారికి మరీ ముఖ్యంగా అగ్ర కులాల వారికీ న్యాయం చేస్తూ టికెట్ల కేటాయింపు చేసారు. అయితే ఈ నాలుగున్నరేళ్ల కాలంలో చాలా మార్పు వచ్చింది. కొన్ని కులాలు వైసీపీ మీద మంటెక్కి ఉన్నాయి.
దానికి వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ కార్యక్రమాల వల్ల పాలనాపరంగా వారికి ఇబ్బంది కావడం వల్ల కావచ్చు. మొత్తానికి 2019లో అధిక శాతం ఓట్లేసిన ఆయా సామాజికవర్గాలు ఈసారి ఫేస్ టర్న్ ఇచ్చుకోవచ్చు అని చర్చ అయితే సాగుతోంది. అయితే ఆయన కులాల స్థానంలో బీసీలను నమ్ముకుని వారికి ఎక్కువ టికెట్లు ఇవ్వడం ద్వారా ఈసారి ఏపీలో అద్భుతమైన విక్టరీ కొట్టాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు.
ముందుగా ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఇక్కడ కాపులు పెద్ద ఎత్తున ఉన్నారు. అలాగే బీసీలు కూడా ఉన్నారు. అలాగే కొన్ని చోట్ల ఎస్సీస్ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు. ఈ నేపధ్యంలో పార్టీలో బలమైన కాపు నాయకులకు ఈసారి కూడా టికెట్లు ఖాయమని అంటున్నారు. అలాగే అంగబలం అర్ధబలం ఉండి పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్న వారు, ప్రజలలో మంచి పేరు ఉన్న వారి టికెట్ కి ఢోకా లేదని అంటున్నారు.
అదే సమయంలో వీక్ గా ఉన్న క్యాండిడేట్ల ప్లేస్ లో సామాజిక ప్రయోగం చేయడానికి వైసీపీ సిద్ధంగా ఉంది అని అంటున్నారు. అలా చాలా చోట్ల బీసీలకు ఈసారి టికెట్లు దక్కే చాన్స్ ఉంది అని అంటున్నారు. అలా కాపు వర్సెస్ బీసీ అన్న యాంగిల్ లో ఫైటింగ్ ఇస్తే అది అంతిమంగా వైసీపీకి ప్లస్ అవుతుందని లెక్కలు వేస్తున్నారు. అదే విధంగా బీసీ పార్టీగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వీలు అవుతుంది అని భావిస్తున్నారు.
ఇక గుంటూరు, క్రిష్ణా జిల్లాలలో కమ్మ డామినేటింగ్ ప్లేస్ లలో బీసీలను దించడం ద్వారా భారీ రాజకీయ లబ్దిని పొందాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. కమ్మ ఓటర్లలో నలభై శాతం దాకా గత ఎన్నికల్లో వైసీపీకి పడ్డాయి. ఈసారి అమరావతి రాజధాని ఫ్యాక్టర్ తో తేడా కొట్టే చాన్స్ ఉంది అని అంటున్నారు. అందువల్ల బీసీ ఆయుధంతో వ్యతిరేకత ఏమైనా ఉంటే దాన్ని ఎదుర్కోవాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో చిలకలూరిపేట సీటులో పత్తిపాటి పుల్లారావు మీద బీసీ అయిన విడద రజనీని దించి వైసీపీ సక్సెస్ కొట్టింది. ఈసారి అలాంటి ప్రయోగాలు చాలానే ఉండవచ్చు అని అంటున్నారు.
అదే విధగ్నా చూసుకుంటే బ్రాహ్మిన్స్ కి వైసీపీ గత ఎన్నికల్లో నాలుగు టికెట్లు ఇచ్చింది. రెండు చోట్ల మాత్రమే వారు గెలిచారు. ఈసారి మాత్రం బీసీలకు ఆ టికెట్లు ఇస్తారని అంటున్నారు. విశాఖ సౌత్ లో బ్రాహ్మిణ్ అయిన ద్రోణం రాజు శ్రీనివాస్ కి టికెట్ ఇస్తే ఓడిపోయారు. ఆయన కరోనా టైం లో చనిపోయారు. ఇక బ్రాహ్మిణ్ కి టికెట్ ఇవ్వమని సీతం రాజు సుధాకర్ లాంటి బ్రాహ్మణ నాయకులు కోరుతున్నా బీసీలకే పెద్ద పెట్ట వేయాలని వాసుపల్లి గణేష్ కుమార్ కి టికెట్ ఇస్తున్నారు.
అలాగే క్షత్రియులకు కూడా గతంలో టికెట్లు బాగా ఇచ్చారు. ఇపుడు విశాఖ ఉత్తరంలో కేకే రాజుకు టికెట్ అని అంటున్నా టీడీపీ వేసే ఎత్తుగడను బట్తి ఇక్కడ బీసీ కార్డు ని వైసీపీ ప్రయోగించినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఇదే తీరున ఏపీ అంతా బీసీ కార్డుతోనే ఈసారి వైసీపీ దూసుకుని పోతుంది అని అంటున్నారు.దీని వల్ల రెండు లాభాలు ఉంటాయని, ఒకటి రాజకీయంగా గెలవడం సామాజికంగా టీడీపీ బీసీ బ్రాండ్ ని దెబ్బ తీయడం అని అంటున్నారు.