టికెట్ పంచాయతీ : మైలవరంలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే.....?
ఇదే నియోజకవర్గంలో ఉనన్ మరో సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుకు హై కమాండ్ గట్టి హామీ ఇచ్చింది అని కూడా చర్చించుకుంటున్నారు
By: Tupaki Desk | 26 Aug 2023 12:28 PM GMTక్రిష్ణా జిల్లా రాజకీయాలు వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉన్నాయి. నిన్న గన్నవరం నేడు మైలవరం రేపు మరోటి అన్నట్లుగా రాజకీయ కాక అలా సలసల మండుతూనే ఉంది. గన్నవరంలో వైసీపీ కీలక నేత యార్లగడ్డ వెంకటరావు పార్టీని గుడ్ బై కొట్టేసి టీడీపీలో చేరిపోయారు. ఆయనకు ఆ పార్టీ ఇంచార్జిగా నియమించింది. ఇక గన్నవరంలో వల్లభనేని వంశీకి లైన్ క్లియర్ అయింది అని అంటున్నారు.
ఇదే నియోజకవర్గంలో ఉనన్ మరో సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుకు హై కమాండ్ గట్టి హామీ ఇచ్చింది అని కూడా చర్చించుకుంటున్నారు. సో గన్నవరంలో వైసీపీ కి బిగ్ రిలీఫ్ దొరికింది అనుకునేలోగానే ఇపుడు మైలవరంలో మంటలు రేగుతున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ వర్సెస్ మంత్రి జోగి రమేష్ అన్నట్లుగా చాలా కాలంగా రాజకీయం సాగుతోంది.
2019 ఎన్నికల్లో పెడన నుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన జోగి రమేష్ సొంత ఊరు మైలవరంలో ఉంది. నిజానికి ఆయన 2009లో మొదటి సారి కాంగ్రెస్ తరఫున పెడన నుంచి గెలిచారు. 2014లో ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన మైలవరం సీటుని సేఫెస్ట్ గా చూస్తున్నారు. మైలవరంలో గతంలో కాంగ్రెస్ కి టీడీపీకి సమాన బలం ఉంది. ఇక్కడ నుంచి రెండు సార్లు దేవినేని ఉమా మహేశ్వరరావు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఆయన ఓటమి పాలు అయ్యారు.
ఇక 2019లో వసంత క్రిష్ణ ప్రసాద్ వైసీపీలో చేరి ఈ సీటు దక్కించుకున్నారు. గెలిచారు. ఆయన 2024లో కూడా ఇదే సీటు నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే మంత్రి జోగి రమేష్ నియోజకవర్గం రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారు అని చాలా కాలం క్రితమే ఆయన హై కమాండ్ కి ఫిర్యాదు చేయడం ఒక దశలో హట్ కామెంట్స్ చేయడంతో హై కమాండ్ ఆయన్ని పిలిపించి మాట్లాడింది.
మంత్రి జోగి రమేష్ కి కూడా నచ్చచెప్పి ఒకరి నియోజకవర్గాలలో మరొకరు జోక్యం చేసుకోవద్దు అని సూచించింది. అప్పట్లో గడప గడప కార్యక్రమాన్ని కూడా వసంత క్రిష్ణ ప్రసాద్ చేయకుండా అలిగి దూరంగా ఉండిపోయారు. హై కమాండ్ మాటతో ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ మధ్య ఒక నలభై అయిదు రోజుల పాటు వసంత అమెరికా టూర్ వెళ్లారు.
దాంతో జోగి రమేష్ వర్గం మైలవరంలో హల్ చల్ చేయడమే కాకుండా ఈసారి టికెట్ జోగి రమేష్ కే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ వచ్చింది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వసంత క్రిష్ణ ప్రసాద్ దీని మీద మండిపడుతున్నారని అంటున్నారు. పార్టీలో కొందరు వర్గ పోరుని కోరి పెంచి పోషిస్తున్నారు అని తాను మెత్తగా ఉంటాను అనుకుంటే పొరపాటేనని వసంత చేస్తున్న హాట్ కామెంట్స్ తో మైలవరం వైసీపీ రాజకీయం మళ్లీ వేడెక్కింది అంటున్నారు.
తన సీటును లాగేద్దామని చూస్తున్న వారికి ఆ చాన్స్ ఇవ్వనని ఆయన అంటున్నట్లుగా కూడా చెబుతున్నారు. ఒక విధంగా డైరెక్ట్ ఫైట్ కి వసంత్ రెడీ అయిపోయారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే మైలవరంలో జరుగుతున్నది అంతా హై కమాండ్ కి తెలుసు అని వేరేగా చెప్పాల్సింది లేదని ఆయన అంటున్నట్లుగా కూడా ప్రచారంలో ఉంది.
మరి మైలవరం టికెట్ ఎవరికి ఇస్తారు అన్నది చర్చకు వస్తోంది. బీసీ అయిన మంత్రి జోగి రమేష్ కే మైలవరం టికెట్ ఇస్తారా అన్న డౌట్స్ వస్తున్నాయి. జోగి రమేష్ కాంగ్రెస్ నుంచి వైసీపీ లోకి వచ్చిన వారు. జగన్ కి అత్యంత సన్నిహితులు. ఇక ఆయన పెడన నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు అని అంటున్నారు. దాంతో ఆయనను మైలవరం షిఫ్ట్ చేస్తారని అంటున్నారు. మరి ఆయనకు మైలవరం ఇస్తే వసంత ఏ రూట్ తీసుకుంటారు అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.
అయితే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారా లేక తెలుగుదేశం వైపు చూస్తారా అన్నది కూడా చర్చనీయాంశం అవుతోంది. అయితే టికెట్ విషయంలో జగన్ నుంచి కచ్చితమైన హామీ ఉందని 2024లో వైసీపీ నుంచి పోటీ చేసేది గ్లిచేది వసంత క్రిష్ణ ప్రసాద్ మాత్రమే అని ఆయన వర్గం ధీమాగా చెబుతోంది. చూడాలి మరి మైలవరం మంటలు ఎప్పటికి చల్లారుతాయో.