Begin typing your search above and press return to search.

పవన్ బాలయ్యల పొలిటికల్ మల్టీస్టారర్...ప్లాన్ ఎవరిది...?

జనసేన మిత్రపక్షంగానే దాదాపుగా వ్యవహరిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు మీద అభిమానాన్ని గౌరవాన్ని కురిపిస్తున్నారు

By:  Tupaki Desk   |   14 Sept 2023 9:16 AM IST
పవన్ బాలయ్యల పొలిటికల్ మల్టీస్టారర్...ప్లాన్ ఎవరిది...?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు నందమూరి బాలయ్య మరో వైపు ఉంటేనే ఊపు ఉంటుంది. అలాంటి ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అంతే అహా వేదిక అన్ స్టాపబుల్ ప్రోగ్రాం ద్వారా ఫుల్ టేస్ట్ ని చూపించారు. అది ఘాటు మసాలానే అందించింది. ఇక పొలిటికల్ గా మల్టీస్టారర్ అవుతుందా అంటే ఆ దిశగా ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు.

టీడీపీకి టాప్ హీరో బాలక్రిష్ణ ఉన్నారు. జనసేన మిత్రపక్షంగానే దాదాపుగా వ్యవహరిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు మీద అభిమానాన్ని గౌరవాన్ని కురిపిస్తున్నారు. ఇపుడు బాలయ్య పవన్ కలసి చంద్రబాబు ఉంటున్న రాజమండ్రీ జైలుకు రాబోతున్నారు ములాఖత్ లో ఈ ఇద్దరు హీరోలూ బాబుని కలవనున్నారు.

బాబు దిశానిర్దేశకత్వంలో రానున్న రోజులలో ఈ ఇద్దరూ రాజకీయ తెర మీద ఏమి చేయబోతున్నారు అన్నదే ఇపుడు అంతటా ఆసక్తిని కలిగించే విషయంగా ఉంది. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా లేదా అంటే సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ అయిన లూద్రా ఒక ట్వీట్ చేసి న్యాయం దూరంగా ఉన్నపుడు ఆయుధం పట్టడమే మార్గం అంటూ ఒక సూక్తిని అందించారు.

అంటే బాబుకు బెయిల్ వస్తుందా రాదా అని దీని మీద తర్జన భర్జన చేసుకునే పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ నేపధ్యంలో అదే కనుక జరిగి బాబుకు బెయిల్ ఆలస్యం అయితే టీడీపీ క్యాడర్ కి మనో ధైర్యం చెప్పేందుకు బాలయ్య రంగంలోకి దిగాల్సి ఉంటుంది. అలాగే జనసేన కూడా టీడీపీ విషయంతో పూర్తి సానుకూలత వ్యక్తం చేస్తూ సీన్ లోకి రావాల్సి ఉంటుంది.

మరో వైపు చూస్తే బాలయ్య పవన్ కళ్యాణ్ విత్ లోకేష్ అన్నట్లుగా బాబు మాస్టర్ ప్లాన్ సాగుతుంది అని అంటున్నారు. అంతా జైలు నుంచే బాబు వ్యూహరచన చేస్తున్నారు అని అంటున్నారు. ఇక జనసేనతో దాదాపుగా మిత్ర బంధం ఫిక్స్ అని అంతా అనుకుంటున్నారు. దాంతో టీడీపీ జనసేన కంబైండ్ గా ఏపీలో కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా రంగం సిద్ధం చేస్తారు అని అంటున్నారు.

గోదావరి జిల్లాలకు కేంద్రంగా ఉన్న రాజమండ్రిలో చంద్రబాబు ఉనారు. అటు బలమైన సామాజిక వర్గాలు కూడా ఈ సమీకరణలతో ఒక్కటిగా టీడీపీకి మద్దతుగా నిలవాలీ అంటే జనసేన పవన్ కీలకం అవుతారు అని అంటున్నారు. అలాగే బాలయ్య పవన్ ల గ్రూప్ ఫోటో కూడా ఆ దిశగానే రాజకీయమైలేజ్ ని సాధించేలా ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు జైలులో ఉన్నారు. బయట సానుభూతి కురియాలి. బాబు కోసం జనాలలో పెద్ద ఎత్తున అభిమానం పొంగాలీ అంటే దానికి పొలిటికల్ మల్టీ స్టారర్ అవసరం అనే అంటున్నారు.