Begin typing your search above and press return to search.

తాజా సర్వే ఫలితాలు... ఏపీలో మళ్ళీ వైసీపీదే అధికారం!

అవును... తెలంగాణలో జన్మత్ సంస్థ వెల్లడించిన ఫలితాలకు ఆల్ మోస్ట్ దగ్గరగా వాస్తవ ఫలితాలు వచ్చాయి

By:  Tupaki Desk   |   28 Dec 2023 10:51 AM GMT
తాజా సర్వే ఫలితాలు... ఏపీలో మళ్ళీ వైసీపీదే అధికారం!
X

తెలంగాణలో ఎన్నికలు ముగిసాయి.. కాంగ్రెస్ పార్టీ అధికరాంలోకి వచ్చింది. ఈ విషయంలో పదుల సంఖ్యలో పలు సర్వే సంస్థలు ఫలితాలు వెల్లడించాయి. వీటిలో కొన్ని వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండగా.. మరికొన్ని దరిదాపుల్లో కూడా లేని పరిస్థితి! ఈ సమయంలో జన్మత్ పోల్స్ సంస్థ చేపట్టిన సర్వేకు సంబంధించిన ఫలితాలు.. వాస్తవ ఫలితాలకు అత్యంత సమీపంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సర్వే సంస్థ ఏపీకి సంబంధించిన సర్వే ఫలితాలను వెల్లడించింది.


అవును... తెలంగాణలో జన్మత్ సంస్థ వెల్లడించిన ఫలితాలకు ఆల్ మోస్ట్ దగ్గరగా వాస్తవ ఫలితాలు వచ్చాయి. ఇందులో భాగంగా... తాజాగా ముగిసిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారం కన్ ఫాం అన్నట్లుగా జన్మత్ సంస్థ ఫలితాలు వెల్లడించింది. ఇందులో భాగంగా...

కాంగ్రెస్ కు 61 - 63..

బీఆరెస్స్ కు 45 - 47..

బీజేపీకి 4 - 5...

ఎంఐఎం కి 06 - 07..

ఇతరులకు 01 - 02 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఆ సంస్థ ఫలితాలు వెల్లడించింది.

ఆ ఫలితాలకు కాస్త అటు ఇటుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో...

కాంగ్రెస్ పార్టీకి 64,

బీఆరెస్స్ కు 39,

బీజేపీకి 8,

ఎంఐఎం కి 7,

ఇతరులకు 1 సీటు వచ్చిన సంగతి తెలిసిందే.

అంటే... ఆ సంస్థ చెప్పిన ఫలితాలకు దాదాపుగా వాస్తవ ఫలితాలు ఉన్నాయనే అనుకోవాలి. ఈ నేపథ్యంలో ఏపీలో 2024లో జరగబోయే ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కూడా తాజాగా ఆ సంస్థ వెల్లడించింది.

ఇందులో భాగంగా... అధికార వైసీపీ 116 - 118 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉండగా... టీడీపీ - జనసేన కూటమి 46 - 48 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తాజాగా సర్వే ఫలితాలు వెల్లడించింది. అంటే.. క్లియర్ మెజారిటీతో ఏపీలో మరోసారి వైఎస్ జగన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

ఇలా... ఈ సర్వే సంస్థ చెప్పినట్టుగానే తెలంగాణ ఫలితాలు కూడా రావడంతో... రానున్న 2024 ఎన్నికల్లోనూ వైసీపీ విజయదుందుభి మోగించడం ఖాయమని, మరోసారి ఏపీకి ముఖ్యమంత్రిగా జగన్ కన్ ఫాం అనే కామెంట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి!