Begin typing your search above and press return to search.

ఏక‌గ్రీవ ఆమోదం... ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బుట్టదాఖలు!

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కాస్త అటు ఇటుగా నెల రోజుల ముందు ఓ అంశం విపరీతంగా చర్చనీయాంశం అయ్యింది.

By:  Tupaki Desk   |   23 July 2024 11:05 AM GMT
ఏక‌గ్రీవ ఆమోదం... ల్యాండ్  టైటిలింగ్  యాక్ట్  బుట్టదాఖలు!
X

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కాస్త అటు ఇటుగా నెల రోజుల ముందు ఓ అంశం విపరీతంగా చర్చనీయాంశం అయ్యింది. పైగా... ఏపీలో వైసీపీ ఘోరంగా ఓడిపోవడానికి ఆ అంశమే ప్రధాన కారణం అని, ఆ అంశాంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను జనం బలంగా నమ్మారని.. ఫలితంగా జగన్ ను ఇంటికి పంపారని అంటున్నారు. అదే... ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్!

అవును... ఎన్నికలకు ముందు ఏపీలో తీవ్ర చర్చనీయాంశం అయిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పని నేటితో ఖతం అయ్యింది! తాజాగా ఈ చట్టాన్ని రద్దుచేస్తూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో... జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా రద్దయినట్లయ్యింది. ఇకపై ఆ టాపిక్ ఏపీలో వినిపించకపోవచ్చు.. ఒక్క జగన్ ఓటమికి కారణాలు ప్రస్థావించేటప్పుడు తప్ప!

ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఈ అంశంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నా జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లో, అతి విశ్వాసంతో ఉన్నట్లో కనిపించింది. మరోపక్క... ఈ చట్టం అమలు చేస్తే మీ భూములు మీవి కాకుండా పోతాయి, వాటిని జగన్ లాగేసుకుంటాడు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు చేసిన ప్రచారాన్ని ఏపీ ప్రజానికం బలంగా నమ్మేసింది. మరోవైపు వైసీపీ అంత బలమైన కౌంటర్లూ ఇవ్వలేకపోయింది.

వాస్తవానికి ఈ చట్టంపై సభలో చర్చ జరిగిన సమయంలో... టీడీపీ ఎమ్మెల్యే, నేటి మంత్రి పయ్యావుల కేశవ్ ఆహ్వానించారు.. ఈ చట్టం మంచిదేనని తెలిపారు.! ఇదే విషయాన్ని జగన్ & కో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహిస్తారని భావించినట్లున్నారు. ఈలోపు ఎన్నికలు వచ్చాయి.. చేతులు కాలిపోయాయి.. ఆకులు పట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయింది!

కట్ చేస్తే... కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యలో తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశంలో రెవిన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్.. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీంతో స్పందించిన స్పీకర్... ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు అంగీకరించేవారంతా "అవును" అనాలని సూచించారు. దీంతో.. సభ్యులంతా ఏకగ్రీవంగా "అవును" అన్నారు. బిల్లు రద్ధయ్యినట్లు స్పీకర్ ప్రకటించారు!