Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో స్కిల్ స్కాం పై చర్చ...వైసీపీ మాస్టర్ ప్లాన్

చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ అసెంబ్లీ తొలి రోజునే నానా రచ్చ చేస్తూ వస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేలా మాస్టర్ ప్లాన్ ని వైసీపీ రచించింది

By:  Tupaki Desk   |   21 Sep 2023 10:18 AM GMT
అసెంబ్లీలో స్కిల్ స్కాం పై చర్చ...వైసీపీ మాస్టర్ ప్లాన్
X

చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ అసెంబ్లీ తొలి రోజునే నానా రచ్చ చేస్తూ వస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేలా మాస్టర్ ప్లాన్ ని వైసీపీ రచించింది. దాని ప్రకారం బాబు ఏ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నారో ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం కేసుని అసెంబ్లీ ముందు పెట్టి చర్చించాలని అధికార పక్షం నిర్ణయించింది.

బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ నెల 22న ఈ స్కాం మీద అసెంబ్లీలో చర్చ జరగనుంది అన్న మాట. ఈ స్కాం పుట్టుపూర్వోత్తరాలు, దీని వెనక సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు, అసలు ఎవరి నుంచి ఎవరిని డబ్బులు వెళ్లాయి మొత్తం ఈ స్కాం ఏంటి అన్నది అసెంబ్లీ వేదికగా వైసీపీ ప్రజలకు తెలియ చేయనుంది అంటున్నారు.

నిజానికి ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం గురించి చాలా మందికి తెలియదు. చంద్రబాబు దేనికి అరెస్ట్ అయ్యారో కూడా తమ్ముళ్ళకు సైతం తెలియకుండా ఆ పార్టీ మొదటి నుంచి అక్రమ అరెస్ట్ అని చెప్పడం మొదలెట్టింది. ఇక బాబు తరఫున న్యాయవాదులు సైతం బాబుని రిమాండ్ చేయడం తప్పు అక్రమం, గవర్నర్ పర్మిషన్ ముందుగా తీసుకోవాలని వాదిస్తూ వచ్చారు.

దీంతో చంద్రబాబు ఎందుకు అరెస్ట్ చేశారు అన్న విషయం అయితే ప్రజలకు అనుకున్నంతగా వెళ్లలేదు అంటున్నారు. ఇపుడు ఆ వివరాలు అన్నీ వైసీపీ అసెంబ్లీలో చెప్పనుంది అంటున్నారు. అంతే కాదు, చంద్రబాబు సీఎం అయ్యాక నుంచి ఇప్పటిదాకా ఆయన హయాంలో జరిగిన స్కాంలు ఏంటి అన్నవి కూడా వైసీపీ బయటపెట్టనుంది అంటున్నారు.

ఇక చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో సభలో పొలిటికల్ మైలేజ్ సాధించాలని టీడీపీ చూస్తూంటే దానికి పై ఎత్తు వేసి ఏకంగా స్కాం గురించే చర్చించడానికి వైసీపీ సిద్ధపడం విశేషమే అంటున్నారు. 22న అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయం అయిన వెంటనే చంద్రబాబు అరెస్ట్ ఎందుకు అయ్యారు ఆయన చేసిన స్కాం ఏంటి అందులో ఆధారాలు ఏంటి అన్న దాని మీదనే వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు అంతా మాట్లాడుతారు అని అంటున్నారు.

దీని వల్ల పూర్తి సమాచారం ప్రజలకు తెలుస్తుంది అని అంటున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు పద్నాలుగు మందిని సభలో ఒక్క రోజు మాత్రమే సస్పెండ్ చేశారు. 22న టీడీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ మీద చర్చకు వారు ఓకే చెప్పి అందులో పాల్గొంటారా లేదా అన్నది చూడాలని అంటున్నారు. ఒకవేళ టీడీపీ చర్చకు సరనంటే మాత్రం అసెంబ్లీ దద్దరిల్లడం ఖాయం. మొత్తం మీద 22న అసెంబ్లీ వెరీ ఇంటరెస్టింగ్ అని అంటున్నారు.