Begin typing your search above and press return to search.

స్పీకర్ పదవికి గట్టి పోటీ... ఆ సీనియర్లలో ఒకరికి ఛాన్స్?

ఈ సమయంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎవరిని వరించనుందనేది ఆసక్తిగా మారింది.

By:  Tupaki Desk   |   13 Jun 2024 7:12 AM GMT
స్పీకర్ పదవికి గట్టి పోటీ... ఆ సీనియర్లలో ఒకరికి ఛాన్స్?
X

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ విషయంలో యువ, సీనియర్ నేతలతో బాబు బేలెన్స్డ్ గా కేబినెట్ కూర్పు చేశారని అంటున్నారు. ఈ సమయంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవి ఎవరిని వరించనుందనేది ఆసక్తిగా మారింది.

అవును... ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ కీలకమైన అసెంబ్లీ స్పీకర్ పోస్ట్ ఎవరిని వరించనుందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో మంత్రిపదవి దక్కని పలువురు సీనియర్లతో పాటు.. పర్సనల్ అజెండా పుష్కలంగా కలిగిఉన్న నేతల మధ్య భారీ పోటీ నెలకొందని అంటున్నారు. ఇందులో భాగంగా పలువురు సీనియర్ నాయకులు, మోస్ట్ సీనియర్ నాయకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

వాస్తవానికి ఏపీ ఎన్నికల సమయంలో తనను స్పీకర్ గా చూడాలని ప్రజలు భావిస్తున్నారంటూ స్పందించారు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు. దీంతో... స్పీకర్ పొస్ట్ పై ఆయన ముందుగానే ఖర్చీఫ్ వేశారనే కామెంట్లు వినిపించాయి. చాలామంది టీడీపీ శ్రేణులు కూడా ఆ ఛైర్ లో ట్రిపుల్ ఆర్ బాగా సూటవుతారు.. విపక్షాలను పక్కాగా కంట్రోల్ లో పెడతారనే కామెంట్లు వినిపించాయి.

అయితే... ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో అంత క్లిష్టపరిస్థితులు ఉండకపోవచ్చు. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉండటంతో... హౌస్ లో వార్ ఆల్ మోస్ట్ వన్ సైడ్ గానే ఉంటుందని అంటున్నారు. ఇదే సమయంలో... ట్రిపుల్ ఆర్ తో పాటు మరికొంతమంది టీడీపీ సీనియర్ నేతలు పోటీ పడుతున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగా 2014 - 19 సమయంలో మంత్రులుగా చేసినవారూ ఉన్నారని అంటున్నారు.

ఈ క్రమంలో... స్పీకర్ రేసులో కళా వెంకట్రావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయన ఆ పదవికి పూర్తి అర్హుడని.. అనుభవంతో పాటు ఆవేశకావేశాలకు పోని తత్వం అదనపు అర్హత అని చెబుతున్నారు. మరోపక్క గోరంట్ల బుచ్చయ్య చౌదరి విషయంలో చంద్రబాబు ఇప్పటికైనా కరుణించే అవకాశాలు చర్చకు వస్తున్నాయి.

మోస్ట్ సీనియర్ అయిన బుచ్చయ్యను కేబినెట్ లోకి ఎలాగూ తీసుకోలేదు కాబట్టి.. ఈసారి స్పీకర్ ని చేసి గౌరవించే అవకాశాలనూ కొట్టిపారేయలేమని అంటున్నారు. ఇదే క్రమంలో... చింతకాయల అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్, ధూళిపాళ్ల నరేంద్రల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి బాబు మనసులో ఎవరున్నారనేది వేచి చూడాలి.