Begin typing your search above and press return to search.

కీలక బిల్లులతో ఏపీ అసెంబ్లీ...జగన్ మనసులో ఏముంది...?

అసెంబ్లీ సమావేశాల తేదీని కూడా క్యాబినెట్ మీటింగులో ఖరారు చేస్తారు అని అంటున్నారు. ఆ మీదట ఏపీ అసెంబ్లీ జరుగుతుంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   4 Sep 2023 11:30 PM GMT
కీలక బిల్లులతో ఏపీ అసెంబ్లీ...జగన్ మనసులో ఏముంది...?
X

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 నుంచి జరుగుతాయని అనధికార వర్గాల ద్వారా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ నెల 12న తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు. జగన్ ఈ నెల మూడవ వారంలో మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది.

ఈ మంత్రివర్గ సమావేశాలలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాల తేదీని కూడా క్యాబినెట్ మీటింగులో ఖరారు చేస్తారు అని అంటున్నారు. ఆ మీదట ఏపీ అసెంబ్లీ జరుగుతుంది అని అంటున్నారు.

ఏపీ అసెంబ్లీ ఈసారి పది నుంచి పదిహేను రోజుల పాటు జరుగుతుంది అని అంటున్నారు. వైసీపీ ఏలుబడిలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఇన్నాళ్ళు జరగడం అంటే ఇదే తొలిసారి అని భావించాలేమో. మరి ఇంతటి సుదీర్ఘమైన సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారు అన్నది ఒక కీలకమైన ప్రశ్న.

ఈ సమావేశాలలో చాలా కీలకమైన బిల్లులనే వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది అని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. మరో ఏడెనిమిది నెలలలో సార్వత్రిక ఎన్నికలు అంటున్నారు. ఇక జమిలి ఎన్నికలు ముందస్తు ఎన్నికలు అని అనుకుంటే కనుక ఇవే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు చివరికి అవుతాయని కూడా అంటున్నారు.

దాంతో వైసీపీ ఎన్నికలకు వెళ్ళేందుకు ముందు ప్రజలకు మరింత మేలు చేసే విధంగా తన ఆలోచనలకు పదును పెడుతూ అనేక బిల్లులను కూడా ఈ సమావేశాలలో ప్రవేశపెట్టే ఆలోచన ఉందని అంటున్నారు. ఇదే సమయంలో మరిన్ని కొత్త సందేహాలు కూడా పుట్టుకుని వస్తున్నాయి. అవేంటి అంటే మూడు రాజధానుల బిల్లు గురించి. వైసీపీ ఎన్నికల హామీ కాదు కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ అది అయితే సాకారం కాలేదు. న్యాయపరమైన కారణాల వల్లనే అది అలా ఆగింది.

మరి డిసెంబర్లో కానీ ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణకు రాదు. అలాంటపుడు అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఎలా ప్రవేశపెడతారు అన్నది ప్రశ్నగా ఉంది. అయితే బిల్లు ప్రవేశపెట్టకపోయినా తమ ఉద్దేశ్యాలను ఏపీలో పాలనాపరమైన వికేంద్రీకరణ దిశగా తమ ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుంది అని చెప్పడానికి ఈ సమావేశాలను వాడుకుంటారు అని అంటున్నారు.

అంతే కాదు ముఖ్యమంత్రి విశాఖ లో మకాం పెట్టే విషయం పూర్తిగా ప్రభుత్వ ఇష్టం అయినా దాని మీద అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. కొత్త హామీలు ఏవీ ఇవ్వమని వైసీపీ అంటున్నా ఎన్నికల వేళ మరిన్ని వర్గాలను మచ్చిక చేసుకునే క్రమంలో అనేక బిల్లులను సైతం సభ ముందుకు తీసుకుని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.ఏది ఏమైనా ఈసారి సమావేశాలు చాలా కీలకం కాబోతున్నాయని అంటున్నారు.