Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్ధులు వీరే...లిస్ట్ రిలీజ్...!

ఏపీలో బీజేపీ పొత్తులో భాగంగా పోటీ చేసే ఆరు ఎంపీ సీట్లను ఆదివారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించింది.

By:  Tupaki Desk   |   25 March 2024 3:39 AM GMT
ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్ధులు వీరే...లిస్ట్ రిలీజ్...!
X

ఏపీలో బీజేపీ పొత్తులో భాగంగా పోటీ చేసే ఆరు ఎంపీ సీట్లను ఆదివారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించింది. ఆ జాబితాలో ముందు నుంచి ప్రచారంలో ఉన్న పేర్లే కనిపించాయి. అయితే నర్సాపురం ఎంపీ సీటుని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు కేటాయించకుండా వేరే పేరుని ప్రకటించడం విశేషం.

బీజేపీ ప్రకటించిన ఈ లిస్ట్ చూస్తే కనుక అరకు (ఎస్టీ) నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి (ఎస్సీ) నుంచి వరప్రసాద్ రావు, రాజంపేట నుంచి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది.

ఇక నరసాపురం సీటు బీజేపీ తనకే ఇస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకున్న సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర నిరాశకు గురయ్యారని అంటున్నారు. ఆయన టీడీపీ జనసేన బీజేపీలతో ఎంతో సన్నిహితంగా ఉంటూ వస్తునారు. తనకు ఏ పార్టీలో అయినా సీటు ఖాయం అనుకున్నారు.

కానీ బీజేపీకి ఆయన సన్నిహితుడే కానీ సీటు మాత్రం దక్కలేదు. ఆ సీటులో భూపతిరాజు శ్రీనివాస్ వర్మను బీజేపీ ఎంపిక చేసింది. ఈయన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనేది ఒక చర్చ సాగింది. అయితే ఆమె విశాఖ కోరుకున్నారని టాక్ వచ్చినా రాజమండ్రి ఇచ్చారు. ఆలగే కడపకు చెందిన సీఎం రమేష్ ని పది జిల్లాలు దాటించి అనకాపల్లి జిల్లాలో ఎంపీ సీటు ఇవ్వడం విశేషం.

అంతే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి లోక్ సభ బరిలో దిగుతున్నారు. ఆయనకు అధిష్ఠానం రాజంపేట ఎంపీ స్థానం కేటాయించింది. ఈ మొత్తం ప్రక్రియలో చూసుకుంటే కనుక అంతా బయట నుంచి వచ్చి బీజేపీలో చేరిన వారే కావడం విశేషం. పార్టీలో పురందేశ్వరి కాంగ్రెస్ నుంచి వచ్చి చేరారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి కమలం తీర్ధం పుచ్చుకున్నారు. సీఎం రమేష్ 2000లో టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించారు.

ఇక కొత్తపల్లి గీత వైసీపీ నుంచి టీడీపీ ఆ మీదట సొంత పార్టీ ఇపుడు బీజేపీలోకి వచ్చి అరకు టికెట్ దక్కించుకున్నారు అంటున్నారు. వీటన్నింటికంటే మరో విశేషం ఏంటి అంటే మధ్యాహ్నం పార్టీలో చేరి రాత్రికి తిరుపతి ఎంపీ సీటు సాధించిన వరప్రసాద్, ఆయన వైసీపీలో గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి అక్కడ టికెట్ దక్కకపోవడంతో అన్ని పార్టీలు తిరిగి చివరికి బీజేపీలో తేలారు అని అంటున్నారు.