ఏపీలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వీరేనా?
అవును... టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలలో పోటీచేయనున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 24 March 2024 9:01 AM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో అధికార వైసీపీ 175 అసెంబ్లీ, 24 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసి, ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టేసింది! ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరు మినహా ఆల్ మోస్ట్ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేసి, అసంతృప్తులను బుజ్జగించే పనులు చేస్తున్నారు!! ఈ సమయంలో 6 లోక్ సభ స్థానాలకూ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలైనట్లు తెలుస్తుంది!
అవును... టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలలో పోటీచేయనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓడిపోయే స్థానాలన్నీ బీజేపీ కేటాయించారని ఒకరు.. టీడీపీ నుంచి వచ్చిన వారికే బీజేపీలో టిక్కెట్లు కేటాయిస్తున్నారని మరొకరు విమర్శలు చేస్తున్నారు. దీంతో... బీజేపీ లోక్ సభ అభ్యర్థుల జాబితా, వారికి కేటాయించబడిన స్థానాలపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆ జాబితా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఇలా ఉంది!!
అరకు - కొత్తపల్లి గీత
రాజమండ్రి - దగ్గుబాటి పురందేశ్వరి
తిరుపతి - వరప్రసాద్
రాజంపేట - నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
అనకాపల్లి - సీఎం రమేష్
నరసాపురం - శ్రీనివాస్ వర్మ
బీజేపీ పోటీ చేయబోయే 10 అసెంబ్లీ స్థానాలు.. వాటిలో 7 స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. వాటి ప్రకారం...!!
కైకలూరు - కామినేని శ్రీనివాస్ రావు
విశాఖ నార్త్ – విష్ణుకుమార్ రాజు
విజయవాడ వెస్ట్ - సుజనా చౌదరి
జమ్మలమడుగు - ఆదినారాయణ రెడ్డి
ధర్మవరం - సత్యకుమార్
ఎచ్చెర్ల – ఎన్ ఈశ్వర్
బద్వేల్ – రోషన్... ల పేర్లు కన్ ఫాం అయినట్లు తెలుస్తుంది.
ఇక మిగిలిన నియోజకవర్గాలుగా చెబుతున్న పాడేరు, ఆధోని, ఆలూరు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ఖరారు కావాల్సి ఉందని అంటున్నారు. ఈ జాబితాలో ఇప్పటివరకూ సోము వీర్రాజు పేరు ప్రస్థావనకు వచ్చినట్లు కనిపించకపోవడం గమనార్హం.