కన్ఫ్యూజన్ సృష్టించటమే టార్గెట్టా ?
రాజకీయ పార్టీల్లేనే కాదు మామూలు జనాల్లో కూడా కన్ఫ్యూజన్ సృష్టించేస్తున్నారు బీజేపీ నేతలు.
By: Tupaki Desk | 14 July 2023 7:22 AM GMTజనాల్లో అయోమయం సృష్టించటమే కమలనాదులు టార్గెట్ లాగుంది. రాజకీయ పార్టీల్లేనే కాదు మామూలు జనాల్లో కూడా కన్ఫ్యూజన్ సృష్టించేస్తున్నారు బీజేపీ నేతలు. ఒకవైపు ఎన్నికలు దగ్గర కు వచ్చేస్తున్నాయి. మరోవైపు పార్టీల మధ్య పొత్తులు తేలలేదు.
పొత్తుల పై చర్చల పేరుతో కొందరు ప్రయత్నిస్తుంటే మరోవైపు పార్టీల అధినేతలు సొంతంగానే వివిధ ప్రాంతాల్లో పర్యటించేస్తున్నారు. తాజాగా బీజేపీ అధ్యక్షురాలి గా బాధ్యతలు తీసుకున్న దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతు టీడీపీ-బీజేపీ పొత్తును అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు.
ఇదే సమయం లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి కడప లో మాట్లాడుతు బీజేపీ-టీడీపీ పొత్తు డిసైడ్ అయిపోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసే ఎన్నికల కు వెళతాయని స్పష్టంగా ప్రకటించారు. పైగా పొత్తుల విషయం ఫైనల్ అయిపోయినట్లు అధిష్టానం నుండి తమకు సంకేతాలు అందినట్లు కూడా చెప్పారు. ఇదే విషయమై మొన్నటివరకు అధ్యక్షుడిగా పనిచేసిన సోమువీర్రాజు ఎప్పుడు మాట్లాడినా టీడీపీ తో పొత్తుండదనే చెప్పేవారు.
కమలం పార్టీ లోని కొందరు నేతలు టీడీపీ తో పొత్తుండదని చెబుతుంటే మరికొందరేమో ఉంటుందంటున్నారు. ఇలాంటి ప్రకటనలన్నీ జనాల ను అయోమయం లోకి నెట్టేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటుందో ఎవరికీ అర్ధంకావటంలేదు.
బీజేపీ నేతలు ఇదంతా కావాల ని చేస్తున్నదా లేకపోతే కాకతాళీయంగా జరుగుతోందా అన్నదే అర్ధంకావటంలేదు. నిజానికి ఇలాంటి అయోమయ వైఖరి వల్ల పార్టీకే అంతిమనష్టమని అగ్రనేతలు గ్రహిస్తున్నట్లు లేదు. సమస్య తమకే కాదు తమతో పొత్తుపెట్టుకున్న పెట్టుకోవాల ని అనుకుంటున్న పార్టీల మీద కూడా ప్రభావం పడుతుంది.
ఇపుడు జనసేన-బీజేపీలు మిత్రపక్షాల ని అందరికీ తెలిసిందే. అయితే రెండుపార్టీలూ కలిసి ఒక్క కార్యక్రమాన్ని కూడా జాయింటుగా నిర్వహించలేదు. దాంతో పేరు కు మాత్రమే మిత్రపక్షాలని వాస్తవంగా కాదని జనాల కు అర్ధమైపోయింది.
రాబోయే ఎన్నికల్లో జనసేన పొత్తులో నుండి బయట కు వచ్చేసి టీడీపీ తో చేతులు కలిపే అవకాశముందనే ప్రచారం అందరికీ తెలిసిందే. దీనివల్ల ఇటు జనసేన అటు బీజేపీకి కూడా నష్టం జరుగుతోంది. ఇదే విధమైన అయోమయం చివరివర కు కంటిన్యు అయితే బీజేపీ తాను దెబ్బతినటమే కాకుండా ఇటు టీడీపీ అటు జనసేన ను కూడా దెబ్బకొట్టే ప్రమాదముంది.