Begin typing your search above and press return to search.

మీకెన్ని..? మాకెన్ని.. నామినేటెడ్ పోస్టుల‌పై బీజేపీ ఆరా!

ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో బీజేపీకి కొంత మేర‌కు న్యాయం చేయాల‌ని ఆ పార్టీ నాయ‌కులు కోరుతున్నారు.

By:  Tupaki Desk   |   18 July 2024 2:30 AM GMT
మీకెన్ని..?  మాకెన్ని.. నామినేటెడ్ పోస్టుల‌పై బీజేపీ ఆరా!
X

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. మంత్రి ప‌ద‌వులు మూడు పార్టీలు(టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ) పంచుకున్నాయి. ఎలాంటి అసంతృప్తికీ దారి తీయ‌కుండా టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు చాలా జాగ్ర‌త్త‌లు పాటించారు. దీంతో ఎవ‌రూ ఎలాంటిచీకాకులు లేకుండా.. పాల‌న‌లో ముందంజ వేస్తున్నారు. అయితే.. కీల‌క‌మైన‌.. నామినేటెడ్ ప‌ద‌వుల వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. మీకెన్ని.. మాకెన్ని.. అంటూ.. కూట‌మి పార్టీల్లో నాయ‌కుల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతోంది.

కార్పొరేష‌న్లు, మునిసిప‌ల్ స్థాయి సంఘాలు, ఆల‌యాల్లో పాల‌క మండ‌లి బోర్డుల పోస్టులు, ఇవి కాకుండా.. క‌మిష‌న్లు, యూనివ‌ర్సిటీల్లో వైఎస్ చాన్సెల‌ర్ పోస్టులు వంటివి చాలానే ఉన్నాయి. సుమారు 230 వ‌ర‌కు ఈ ప‌ద‌వులు ఉన్నాయి. ఇటీవ‌లే ప్ర‌భుత్వం కూడా.. గ‌త వైసీపీ పాల‌న‌లో ఆయా నామినేటెడ్ పోస్టులు పొందిన వారి వివ‌రాలు సేక‌రించింది. అంతేకా దు.. 15 రోజుల్లోగా ఆయా ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయాలంటూ.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శితోనే ఉత్త‌ర్వులు ఇప్పించింది. దీంతో దాదాపు అన్నీ ఖాళీ అయ్యాయి.

ఒక‌టి రెండు పోస్టుల్లో మిగిలిన వారిని కూడా.. నేడో రేపో ప్ర‌త్యేక ఉత్త‌ర్వుల ద్వారా తొల‌గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు నామినేటెడ్ ప‌ద‌వుల కోసం.. ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభు త్వంపై పోరాడిన మూడు పార్టీల నేతలు పంచుకునేందుకు ఆవురావురు మంటూ.. ఎదురు చూస్తున్నారు. గ‌తానికి ఇప్ప‌టికి కూట‌మి పార్టీల్లో టీడీపీ, బీజేపీకితోడు.. జ‌న‌సేన కూడా వ‌చ్చి చేరింది. దీంతో ఇటీవ‌ల రెండు ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఖాళీ అయితే.. చెరొక‌టీ పంచుకున్నాయి. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో బీజేపీకి కొంత మేర‌కు న్యాయం చేయాల‌ని ఆ పార్టీ నాయ‌కులు కోరుతున్నారు.

ఈ క్ర‌మంలో ఎవరికి వారు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. అయితే.. ఎమ్మెల్యే టికెట్ల వ్య‌వ‌హారంలో త‌మ‌కు త‌క్కు వ‌స్థానాలే కేటాయించినందున‌.. నామినేటెడ్ పోస్టుల్లో అయినా.. న్యాయం చేయాల‌ని బీజేపీ వైపు నుంచి వినిపిస్తున్న డిమాండ్‌. ఈ క్ర‌మంలో సోము వీర్రాజు, విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి, భాను ప్ర‌కాశ్ రెడ్డి వంటివారు.. కూట‌మి స‌ర్కారుపై ఒత్తిడి పెంచుతున్నారు. మ‌రి చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి. ఈ నెల ఆఖ‌రుకు నామినేడెట్ ప‌ద‌వుల‌ను పంచేందుకు చంద్ర‌బాబు కూడా మాన‌సికంగా సిద్ధ‌మ‌య్యారు.