ఏపీలో బీజేపీకి భారీ బలం ఇదే.. !
అయితే.. ఇంతగా బలం లేదని చెబుతున్న పార్టీ అంత పట్టుబట్టడం వెనుక ఏముంది?
By: Tupaki Desk | 12 March 2024 2:25 PM GMTఏపీలో బీజేపీకి బలంలేదు.. అనే వారు చాలా మంది కనిపిస్తున్నారు. అంతేకాదు.. 2019 ఎన్నికల్లో కేవలం 1 శాతం ఓటు కూడా ఆ పార్టీకి పడలేదని, నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని అనేవారు ఉన్నారు. ఇది నిజమే. అయినప్పటికీ.. తాజాగా పొత్తుల్లో ప్రధాన భూమిక పోషించిన పార్టీ బీజేపీ. పట్టుబట్టి 6 పార్లమెంటు స్థానాలను దక్కించుకున్న పార్టీ. అంతేకాదు.. అసెంబ్లీ సీట్లలోనూ పట్టుబట్టి10 సీట్లు దక్కించుకున్న పార్టీ కూడా. అయితే.. ఇంతగా బలం లేదని చెబుతున్న పార్టీ అంత పట్టుబట్టడం వెనుక ఏముంది?
ఇదీ అసలు ప్రశ్న. ఇక్కడ బీజేపీకి ఉన్న బలం నాయకులు, కార్యకర్తలు అనుకుంటే పొరపాటే. వారు ఉన్నారు. లేరని కాదు. సీమలో చూస్తే.. విష్ణువర్ధన్‌రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్, సత్యకుమార్, భానుప్రకాష్‌రెడ్డి.. ఇటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చూసుకుంటే పురందేశ్వరి, కామినేని శ్రీనివాస్, జీవీఎల్ నరసింహారావు, అటు ఉత్తరాంధ్రలో చూసుకుంటే.. విష్ణుకుమార్ రాజు, మాధవ్ వంటివారు ఉన్నారు.
అయితే.. వీరు కాదు.. ఇప్పుడు బీజేపీకి అసలు బలం అంటున్నారు పరిశీలకులు. బీజేపీకి వేరే ప్రధాన మైన బలం ఉందని చెబుతున్నారు. అదే.. ఆ పార్టీని విమర్శించేవారు.. వ్యతిరేకించేవారు లేక పోవడం. ప్రధాన పార్టీలను తీసుకుంటే.. టీడీపీ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇక, వైసీపీ ఇంతకాలం రాష్ట్రం కోసం మోడీతో సామరస్యంగానే ఉంది. ఎన్నో చట్టాల కు కూడా వైసీపీ ఎంపీలు మద్దతిచ్చారు.
సో.. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా.. రెండుప్రధాన పార్టీల నుంచి ఎలాంటి విమర్శలు రావని బీజేపీ భావిస్తోంది. ముందు వైసీపీతోనే కలిసి ముందుకు సాగాలని బీజేపీ ప్లాన్ చేసింది. కానీ, వైసీపీ ఒప్పు కోలేదు. దీంతో టీడీపీ ముందుకు రావడం పవన్ రాయబారాలతో బీజేపీ టీడీపీతో కలిసి ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ బీజేపీని టార్గెట్ చేసే ధైర్యం లేదు.
ఏదైనాఉంటే టీడీపీనే విమర్శిస్తుంది. సో.. మొత్తంగా చూస్తే.. ఏమీలేని కాంగ్రెస్ చేసే విమర్శలు బీజేపీని ఏమీ చేయలేవు. కాబట్టి.. బీజేపీ బలం అంతా.. అసలు వ్యతిరేకత లేకపోవడమే. ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది తర్వాత మాట. ఈ విషయంలో మాత్రం ఫస్ట్ స్టెప్‌లో బీజేపీ సక్సెస్ అయింది.