Begin typing your search above and press return to search.

వైసీపీ మీద సీబీఐ...పురంధేశ్వరి హాటెస్ట్ డిమాండ్!

దగ్గుబాటి పురంధేశ్వరి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాక వైసీపీని బద్ధ విరోధిగా వన్ అండ్ ఓన్లీ ప్రత్యర్ధిగా చూస్తూ రావడం మొదలైంది.

By:  Tupaki Desk   |   9 Oct 2023 2:45 AM GMT
వైసీపీ మీద సీబీఐ...పురంధేశ్వరి హాటెస్ట్ డిమాండ్!
X

దగ్గుబాటి పురంధేశ్వరి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాక వైసీపీని బద్ధ విరోధిగా వన్ అండ్ ఓన్లీ ప్రత్యర్ధిగా చూస్తూ రావడం మొదలైంది. టీడీపీని కూడా సరిసమానంగా విమర్శించడం ద్వారా పొలిటికల్ స్పేస్ ని గెయిన్ చేయడం అన్న ప్రయత్నం అయితే ఎక్కడా కనిపించడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి.

ఇక టీడీపీతో క్లోజ్ గా బీజేపీలో ఒక వర్గం ఉందని అంటారు. ఇపుడు పురంధేశ్వరి కూడా ఆ వర్గానికి అనుకూలంగా ఉంటారని ఆరోపణలు అయితే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే అందరి కంటే ముందే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ని ఖండించి పురంధేశ్వరి విమర్శల పాలు అయ్యారు.

ఇక ఆమె గత నెల రోజులుగా తన వంతుగా తాను బీజేపీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేశారని అంటూ వచ్చారు. ఇపుడు ఆమె బీజేపీ పెద్ద కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కలవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె హో మంత్రికి ఏకంగా వైసీపీ సర్కార్ మీద భారీ ఫిర్యాదునే చేశారు.

ఏపీలో మద్యం అమ్ముకుని అవినీతికి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు తెర తీశారని ఆమె ఘాటైన ఆరోపణలు చేశారు మద్యం తయారీ నుంచి అమ్మకం దాకా మొత్తం అవినీతి మయం అని ఆమె అమిత్ షా దృష్టికి తెచ్చారు. గతంలో మధ్యం అమ్మకాల కోసం వేలం వేసేవారని అలా మద్యం దుకాణాలకు అనుమతి ఉండేదని, ఇపుడు ప్రభుత్వమే మధ్యం అమ్మకాలను చేస్తూ అది కూడా నూటికి ఎనభై శాతం నగదు ద్వారానే చేస్తూ వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని అమిత్ షా దృష్టికి తెచ్చారు.

ఈ విషయంలో ఏకంగా వైసీపీ నేతల నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా అందరి హస్తం ఉందని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. మరో వైపు కల్తీ మధ్య ద్వారా ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ఆమె అంటున్నారు. కేవలం ఒక మధ్యం బాటిల్ తయారు చేయడానికి 15 రూపాయలు అయితే దాన్ని ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా అమ్ముతున్నారని ఆమె ఫైర్ అయ్యారు.

ఇక మధ్యం అమ్మకాల ద్వారా ఏడాదికి ఏకంగా 57 వేల 600 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తూంటే దాన్ని 32 వేల కోట్లుగా చూపిస్తున్నారు. పాతిక వేల కోట్ల దాకా వైసీపీ నేతలు దోచుకుంటున్నారని అమిత్ షా దృష్టికి ఆమె తెచ్చారు. ఈ మొత్తం మద్యం అవినీతి విషయంలో అమాయక ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని ఆమె పేర్కొంటూ అమిత్ షాకి మొత్తం వివరాలతో కూడిన లేఖను అందించారని తెలుస్తోంది.

ఏపీలో ఎనభై లక్షలో మంది మధ్యం ప్రతీ రోజూ తాగుతున్నారని, ప్రతీ ఒక్కరూ రెండు వందల రూపాయలు దాని కోసం వెచ్చిస్తున్నారని, ఈ సొమ్ము అంతా ఎక్కడికి పోతోందో సీబీఐ విచారణ వేసి మరీ వెలికి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక వైపు టీడీపీ అధినేత అరెస్ట్ అయ్యారు. ఏపీ సీఐడీ కేసులో ఆయన ఉన్నారు.

ఇపుడు ఏపీలో వైసీపీ వ్యతిరేకులంతా కత్తులు నూరుతున్నారు. అధికారంలో ఉన్న బీజేపీతో ఎవరికీ కలిసేందుకు వీలు దొరకడంలేదు. ఆ పార్టీకి చెందిన పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్ళడం ద్వారా వైసీపీ మీద సీబీఐ విచారణకు కోరడం వెనక టిట్ ఫర్ టాట్ వ్యూహం ఉందా అన్న చర్చ అయితే నడుస్తోంది. ఇది రేపటి ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తుందా అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.