జమిలి పై జగన్ డెసిషన్ సంచలనమేనా ...?
జమిలి ఎన్నికలు అంటోంది కేంద్రం, అలా అంటే దేశంలో అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు ఒకేసారి పెట్టాలి. దానికి రాజ్యాంగ సవరణ వంటి పెద్ద కార్యక్రమం ఉంటుంది.
By: Tupaki Desk | 3 Sep 2023 4:25 AM GMTజమిలి ఎన్నికలు అంటోంది కేంద్రం, అలా అంటే దేశంలో అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు ఒకేసారి పెట్టాలి. దానికి రాజ్యాంగ సవరణ వంటి పెద్ద కార్యక్రమం ఉంటుంది. అది అసలు ఇప్పట్లో కుదిరేది కాదు. అందువల్ల ఎలాంటి పేచీ పూచీ లేకుండా ఉండాలంటే డిసెంబర్ లో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు మరో అయిదారు రాష్ట్రాలను ముందుకు తోసి జమిలి ఎలక్షన్స్ కి దారి తీయించవచ్చు.
అలా చూసుకుంటే ఆ మరో అయిదారు రాష్ట్రాల్లో బీజేపీ పాలిత మహారాష్ట్ర, సిక్కిం వంటివి ఉన్నాయి. ఇక ఒడిషా లో బిజూ జనతాదళ్ మిత్రపక్షం కాకపోయిన ప్రతిపక్షం కాదు, బీజేపీకి కాస్తా అనుకూలంగానే ఉంటుంది. ఏపీలో వైసీపీ బీజేపీకి పూర్తి మద్దతు ఇచ్చే పార్టీగానే జాతీయ స్థాయిలో చూస్తారు.
ఇలా దాదాపుగా డజన్ వరకూ ఉన్న స్టేట్స్ ని కలుపుకుని జమిలి ఎన్నికల పేరిట డిసెంబర్ లో ఎన్నికల నగారా మోగించాలన్నది బీజేపీ మార్క్ పట్టుదలగా ఉంది. దానికి ఏపీలో వైసీపీ ఏమంటుంది అన్నది ఇప్పటిదాకా తెలియలేదు. అయితే జమిలి ఎన్నికలకు మేము సుముఖమే అంటున్నారు వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్.
కేంద్రంలో లోక్ సభకు ముందస్తు వస్తే ఏపీలో కూడా ముందుగా ఎన్నికలకు వెళ్ళేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఆయన ఒక పెద్ద మాటనే చెప్పేశారు. అయితే చివరాఖరున సవరణగా మరో మాట అన్నారు. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది తమ ముఖ్యమంత్రి పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్ అని.
నిజమే జగనే ఈ విషయంలో ఏం చేసినా చెప్పినా జరిగేది. ఏపీకీ ఢిల్లీకి ఉన్న రిలేషన్స్, రాజకీయ సమీకరణలు. లెక్కలు చాలా ఇపుడు అర్జంటుగా పరిగణనలోకి వస్తాయని అంటున్నారు. బీజేపీకి వైసీపీ ఎంత దగ్గర ఎంత దూరం అన్నది కూడా చూడాల్సి ఉంటుందని అంటున్నారు. అలాగే ఢిల్లీకి ఏపీకి మధ్య గ్యాప్ ఎంత ఉంది అన్నది కూడా చెప్పేది ఈ డెసిషన్ అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ లాభం ఉంటేనే ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకునేది. అది లేదు కాదూ అనుకుంటే నో చెప్పేస్తారు.
అన్ని విషయాలలో పూర్తి అవగాహన ఉన్న వైసీపీ అధినాయకత్వం అంత ఈజీగా ఎస్ అని చెప్పదు. అదే విధంగా నో కూడా చెప్పదు అని అంటున్నారు. పూర్తిగా సమగ్రంగా ఆలోచించిన మీదటనే ఈ విషయంలో సంచలన నిర్ణయమే తీసుకుంటుంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఏపీలో పొత్తుల కధ కూడా చూసి అప్పటికి మారిన రాజకీయంలో వైసీపీ ఎక్కడ ఉంటుంది ఏమిటి అన్నవి కూడా అంచనా కట్టుకుని జమిలి సై అన్నా లేక వద్దని అన్నా చేస్తుంది అంటున్నారు. మొత్తానికి జమిలికి మేము రెడీ అని వైసీపీ అనాలీ అంటే దాని వెనక చేయాల్సిన కసరత్తు చాలానే ఉంటుంది అని అంటున్నారు.
అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి తలలో నాలుక లాంటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి దీని మీద ఇప్పటిదాకా ఏమీ మాట్లాడలేదని గుర్తు చేస్తున్నారు. సో జగన్ తీసుకునే డెసిషన్ కచ్చితంగా సంచలనమే అవుతుంది అని అంటున్నారు. సో ఆ డెసిషన్ ఏంటి అన్నది వెయిట్ అండ్ సీ.