జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేసే కుట్ర? శవాలు గాల్లో లేస్తాయంటూ గోడపై రాతలు
ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విపరీత పరిణామం ఏపీలో చోటు చేసుకుంటోంది.
By: Tupaki Desk | 5 Nov 2023 6:09 AM GMTఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విపరీత పరిణామం ఏపీలో చోటు చేసుకుంటోంది. అయితే.. ఈ తరహా పరిణామాల్ని పరిశీలిస్తే.. కామన్ గా ఒక అంశం కనిపిస్తుంటుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ చేసే తరహాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
ఒక ఆర్ఎంపీ వైద్యుడి క్లినిక్ లో వస్తువుల్నితగలబెట్టేసిన కొందరు తాము వైసీపీ అబిమానులమంటూ బెదిరింపులకు దిగటమే కాదు.. జగనన్న ఫ్యాన్స్ తో పెట్టుకుంటే శవాలు గాల్లోకి లేస్తాయంటూ బెదిరింపులకు పాల్పడటం కనిపిస్తుంది. అంతేకాదు.. తమ ఫోన్ నెంబరును కూడా గోడపై రాయటం గమనార్హం. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన వారు ఈ ఉదంతంపై షాక్ కు గురవుతున్నారు.
కనిగిరి పట్టణానికి చెందిన ఉయ్యాలవాడ అజయ్ కుమార్ కొన్నేళ్లుగా నేషనల్ హైవే పక్కనే ఆర్ఎంపీ డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి వేళలో.. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు.. సదరు ఆర్ఎంపీ వైద్యుడి రేకుల గది తాళాలు పగలకొట్టి.. లోపల ఉన్న ధ్రువపత్రాలు.. ఇతర పత్రాల్ని దగ్థం చేశారు. సుమారు రూ.లక్ష విలువ చేసే ఫర్నీచర్ ను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. వైద్యానికి ఉపయోగించే మందుల్ని.. సామాన్లను తగలబెట్టేశారు.
అంతేకాదు.. సదరు ఆర్ఎంపీ డాక్టర్ ను బెదిరిస్తూ.. గోడల మీద హెచ్చరిక మెసేజ్ లు పోస్టుచేశారు. తాను ఎవరి జోలికి వెళ్లనని.. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదంటూనే.. ఇంత రచ్చ చేసన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. తాను టీడీపీకి చెందిన పిచ్చాల సిద్దార్థ రెడ్డి రేకుల షెడ్యును అద్దెకు తీసుకున్నానని.. అంతకు మించి తాను చేసిన తప్పేమీ లేదన్నది ఆర్ ఎంపీ వైద్యుడి వెర్షన్. ఏమైనా.. తనకు తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నాడు సదరు ఆర్ఎంపీ వైద్యుడ్ని ఏ రీతిలో దైర్యాన్ని నూరిపోస్తారన్నది ఒక ఎత్తు అయితే.. ఇలా అధికార పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీసేలా పరిణామాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.