Begin typing your search above and press return to search.

వాట్ ఏ స్పీచ్ జగన్ సాబ్... వాళ్లందరికీ ముచ్చెమటలు!

తాజాగా జగన్ ఆ ప్రశ్నలకు బలమైన సమాధానం ఇచ్చారు.

By:  Tupaki Desk   |   21 July 2023 8:30 AM GMT
వాట్  ఏ స్పీచ్  జగన్  సాబ్... వాళ్లందరికీ  ముచ్చెమటలు!
X

ఎల్లో టీం అంతగా రెచ్చిపోతున్న సీఎం వైఎస్ జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఒకవర్గం మీడియాతో కలిసి ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేన ముప్పేటదాడి చేస్తున్నా ఎందుకు తిరగబడటం లేదు?” ఇన్నాళ్లు సగటు వైసీపీ అభిమాని మదిలో మెదిలిన ప్రశ్నలు ఇవి! కానీ.. తాజాగా జగన్ ఆ ప్రశ్నలకు బలమైన సమాధానం ఇచ్చారు.

అవును... ఇంతకాలం వాలంటీర్లపై ఎంతమంది ఎలాంటి అవాకులూ చెవాకులూ పేలినా మౌనంగా భరించినట్లు కనిపించిన జగన్... జూలు విదిల్చినట్లు కనిపించారు. కరెక్ట్ టైమ్ చూసుకుని, వాలంటీర్లపై విమర్శలు చేస్తున్నవారికి దిమ్మతిరిగేలా సీఎం జగన్ ఒక్క స్పీచ్‌ తో ఇచ్చిపడేశారు! దీంతో ఆ బ్యాచ్ అంతా తేరుకోవడానికి ఎంతటైం పడుతుందో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మా వాలంటీర్లనే అంటారా?:

వాస్తవంగా సీఎం వైఎస్ జగన్ గత కొంతకాలంగా ప్రభుత్వంపై వస్తోన్న విమర్శల్ని తిప్పికొడుతున్నారు. ప్రతీ బహిరంగ సభలోనూ ముసలాయన, దత్తపుత్రుడు అంటూ సెటైర్లు వేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో జరిగిన సభలో ఆ విమర్శల పదును పెంచారు.

దీంతో... ఇప్పటీరకూ ఒకలెక్క.. ఇకనుంచి ఒకలెక్క.. వాలంటీర్లను ఏమైనా అంటే వణికిస్తా అన్నట్లుగా చెలరేగారని కామెంట్లు వినిపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా వాలంటీర్లపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వంగలపూడి అనిత వంటి వారు చేసిన దిగజారుడు వ్యాఖ్యలే అందుకు కారణం!

గత నాలుగేళ్లుగా నిస్వార్థంగా పేదల కోసం వాలంటీర్లు పనిచేస్తున్నా.. సంస్కారహీనంగా పవన్ - చంద్రబాబు & కో కామెంట్స్ చేయడం సీఎం వైఎస్ జగన్‌ కి కోపం తెప్పించిందని తెలుస్తుంది. రోజు రోజుకీ వారి దిగజారుడుతనం శృతిమించడంతో జగన్ కూడా డోస్ పెంచారని అంటున్నారు.

ప్రజలకు మంచి చేస్తున్న వారిని తిట్టడం సంస్కారం అనిపించుకోదు అని చురకలు అంటిస్తూ స్లోగా స్టార్ట్ చేసిన జగన్... చివరికి వచ్చే సరికి ఏకవచన సంభోదనలతో ఫైరయ్యారు. ఫలితంగా... వాలంటీర్లకి తాను ఉన్నాను.. ఉంటాను.. అని బలంగా చాటిచెప్పారు!

ఇలాంటి కుసంస్కారులా మా వాలంటీర్లని విమర్శించేది?:

ఈ సందర్భంగా "ఒకరిని పెళ్లి చేసుకుని వివాహ బంధంలో ఉంటూ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకునేవాడు ఒకడు"... "పట్టపగలు మధ్యం తాగి స్విమ్మింగ్ ఫూల్ లో అమ్మాయిలతో డాన్సులు చేసేవాడు ఇంకొకడు"... బహిరంగ వేదికపై మాట్లాడుతూ "అమ్మాయిలు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, లేదంటే కడుపు చేయాలనే మహానుభావుడు ఒకరు".. షోలకు హాజరై 75ఏళ్ల వయసులో నిస్సిగ్గుగా "మీరు సినిమాల్లో చేశారు నేను కాలేజీ రోజుల్లోనే చేసేశానని చెప్పే ముసలాయన ఇంకొకరు".. ఇలాంటి వాళ్లా మా వాలంటీర్ల గురించి మాట్లాడేది? అంటూ సీఎం జగన్ ఇచ్చిపడేశారు! ఇలాంటి క్యారెక్టర్ లు ఉన్నవాళ్లు వాలంటీర్ల క్యారెక్టర్ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

వాళ్లంతా ఒక్కటే.. కానీ మీకు మనవాళ్ల గురించి తెలుసు కదా?:

వాలంటీర్లపై విమర్శలు పక్కా ప్లాన్‌ తో చేస్తున్నారని ప్రజలకి సీఎం వైఎస్ జగన్ వివరించే ప్రయత్నం చేశారు. స్క్రిప్ట్ రామోజీరావు ఇస్తుంటే.. చంద్రబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని.. ఆ ఇద్దరూ చెప్పినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అయితే.. ఇక్కడ ప్రజలు గుర్తించాల్సింది.. "వాలంటీర్లు ఎవరో కాదు.. మన గ్రామంలోని పిల్లలే.. మన ఊరి బిడ్డలే.. వాళ్ల గురించి మీకు తెలియదా?" అంటూ సీఎం వైఎస్ జగన్ చెప్పగానే సభలో వాళ్లంతా "తెలుసు" అంటూ రిప్లై ఇచ్చారు!

తేలుకుట్టిన దొంగల్లా ఇక పచ్చమంద?:

దీంతో... సీఎం జగన్ చెప్పిన మాటల్లో అన్నీ నిజాలే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. పైగా సాక్ష్యాలు కావాలంటే యూట్యూబ్‌ లో బోలెడు దొరుకుతాయని పరోక్షంగా జగనే హింట్ కూడా ఇచ్చారు. కాబట్టి.. పవన్ - చంద్రబాబు & కో లు... "తాము అలా మాట్లాడలేదు.. అలా చేయలేదు" అని చెప్పే ధైర్యం చేయకపోవచ్చు.

పైగా జగన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చే సాహసం కూడా చేయకపోవచ్చు. దీంతో... ప్రస్తుతానికి తేలు కుట్టిన దొంగల్లా అందరూ మౌనంగా ఉండిపోతారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో వారి అనుకూల మీడియా... అసలు వెంకటగిరి సభలో సీఎం జగన్ రాజకీయ విమర్శలు చేయలేదు అనే తరహాలో కవరింగ్ వార్తలు అచ్చేసే అవకాశం ఉంది.

అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో జగన్ ప్రసంగం వైరల్ అవుతుంది. ఇప్పటికే చాలా మంది వాట్సప్ స్టేటస్సుల్లో జగన్ ఫైర్ దర్శనమిస్తుంది. ఇప్పటిలో పవన్ - బాబు & కో లు తేరుకోలేరనే తరహా పోస్ట్ లతో ఈ స్పీచ్ వైరల్ అవుతోంది!