Begin typing your search above and press return to search.

స్వర్ణ పతకం కలను నెరవేర్చిన ఏపీ డిప్యూటీ కలెక్టర్

ఈ అద్భుత విజయంలో కీలక భూమిక పోషించారు ఏపీ లోని ఎన్టీఆర్ జిల్లాకు డిప్యూటీ కలెక్టర్ గా వ్యవహరిస్తున్న 27 ఏళ్ల జ్యోతి రేఖ.

By:  Tupaki Desk   |   5 Aug 2023 4:14 AM GMT
స్వర్ణ పతకం కలను నెరవేర్చిన ఏపీ డిప్యూటీ కలెక్టర్
X

పెద్దగా ప్రచారం జరగలేదు. కానీ.. అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది భారత మహిళల ఆర్చరీ జట్టు. ఏళ్లకు ఏళ్లుగా తీరని ఒక కలను ఇట్టే తీర్చేసినప్పటికీ పెద్దగా ప్రచారం దక్కలేదు. అన్నింటికి మించి ఈ అద్భుత విజయంలో కీలక భూమిక పోషించారు ఏపీ లోని ఎన్టీఆర్ జిల్లాకు డిప్యూటీ కలెక్టర్ గా వ్యవహరిస్తున్న 27 ఏళ్ల జ్యోతి సురేఖ.

దీంతో.. ప్రపంచ సీనియర్ చాంపియన్ షిఫ్ లో ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న స్వర్ణ పతకం ఎట్టకేల కు మన సొంతమైంది. బెర్లిన్ వేదికగా ఎంతో కాలంగా.. ఎవరికీ సాధ్యం కాని ఘనత ను సొంతం చేసుకున్నారు. తొలిసారి దేశానికి స్వర్ణపతకాన్ని అందించి కొత్త హిస్టరీని క్రియేట్ చేశారు.

ఆ అద్భుత విజయంలో మూడు రాష్ట్రాల కు చెందిన ముగ్గురు మహిళల సమిష్టి కృషి ఉంది. ఏపీకి చెందిన వెన్నెం జ్యోతి, మహారాష్ట్రకు చెందిన ఆదితి స్వామి.. పంజాబ్ కు చెందిన పర్ణీత్ కౌర్ లు కలిసి జట్టుగా ఈ టోర్నీలో పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన మహిళల కాంపౌండ్ టీం విభాగం లో ఫైనల్లో జ్యోతి సురేఖ.. ఆదితి.. పర్ణితితో కూడిన జట్టు మెక్సికో జట్టను 235-229 పాయింట్ల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచారు.

ప్రపంచ ఆర్చరీ చాంపియన్ షిప్ పోటీలు 1931లో షురూ కాగా భారత ఆటగాళ్లు మాత్రం ఈ టోర్నీలో 1981 నుంచి పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నది లేదు. ఇంతకు ముందు 11 పతకాలు రాగా.. అవన్నీ రజత.. కాంస్యాలే. ఇప్పటివరకు 9 రజతాలు.. 2 కాంస్య పతకాలు వచ్చాయే తప్పించి స్వర్ణపతకం మాత్రం దక్కలేదు.

తాజాగా విజయంతో ఆ లోటు తీరింది. 2017, 2021 ప్రపంచ చాంపియన్ షిప్ లో ఫైనల్ చేరిన భారత జట్టు రజత పతకాలతో సరిపెట్టుకోగా.. తాజాగా స్వర్ణాన్ని సాధించాలన్న పట్టుదలను తమ అద్భుతమైన ఆటతీరుతో సొంతం చేసుకున్నారు.

శుక్రవారం టీం టోర్నీ జరగ్గా.. ఈ రోజు వ్యక్తి విభాగం నాకౌట్ దశ జరగనుంది. ఇందులో జ్యోతి సురేఖ.. పర్ణిత్.. ఆదితిలు పోటీ పడుతున్నారు. క్వార్టర్స్ లో పర్ణిత్ తో జ్యోతి సురేఖ.. ఆదితోతో నెదర్లాండ్స్ కు చెందిన సాన్ డిలాట్ తలపడతారు. ఇందులో ఆదితి నెగ్గితే మాత్రం.. సెమీఫైనల్స్ లో మాత్రం మనమ్మాయిల మధ్యనే పోరు జరుగుతుంది. అదే జరిగితే.. ఫైనల్ పోరులోనూ మనమ్మాయి ఒకరు కచ్ఛితంగా నిలుస్తారు. మరేం జరుగుతుందో చూడాలి.