Begin typing your search above and press return to search.

ఓవర్ టూ జూన్ ఫోర్త్ !

ఏపీలో ఎవరిది అధికారం అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పాల్సింది చెప్పాయి. ఇది నచ్చేవారికి నచ్చుతుంది. లేని వారికి లేదు

By:  Tupaki Desk   |   2 Jun 2024 3:35 AM GMT
ఓవర్ టూ జూన్ ఫోర్త్ !
X

ఏపీలో ఎవరిది అధికారం అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పాల్సింది చెప్పాయి. ఇది నచ్చేవారికి నచ్చుతుంది. లేని వారికి లేదు. ఎందుకంటే ఓటమి అంత భయంకరం కాబట్టి. ఎవరికి సీట్లూ ఓట్లూ ఇస్తే వారు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎగ్జిట్ పోల్ అయినా మరేది అయినా ఎంతో కొంత జనం మూడ్ పసిగట్టకుండా ఉండలేవు.

ఎవరైనా ప్రజలను ఆధారం చేసుకునే రాజకీయం చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ పోల్ సర్వేలు కూడా అక్కడ నుంచే వస్తాయి కాబట్టి నిజం ఎంత జీర్ణించుకోలేకపోయినా నమ్మాల్సి ఉంటుంది. కేవలం కొద్ది గంటలలో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఏపీలో ఎవరిది అధికారంలో తెలుస్తుంది.

తొలి రౌండ్లలోనే మొగ్గు ఏమిటో తెలుస్తుంది. మంగళవారం మధ్యాహ్నానికి దాదాపుగా పూర్తి ఫలితాల మీద కచ్చితమైన అంచనా వస్తుంది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఎగ్జిట్ పోల్స్ ఎందుకు అంటే కాస్తా అటూ ఇటూ అయినా తమాయించుకోవడానికి అని భావించవచ్చు. లేదా కుడి ఎడమైతే ఎవరు ఏ ప్లేస్ లో సెటిల్ అవాలో కూడా కాస్తా మానసికంగా ప్రిపేర్ కావడానికి ఈ రెండు రోజులు ఉపయోగపడతాయి.

ఎవరు ఏ పొజిషన్ తీసుకోవాలి ఎక్కడ ఉండాలి అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. వారు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంది. కాబట్టి జనాలు ఇచ్చే తీర్పు కోసం ఎదురుచూడడం మిగిలి ఉంది. అదే అసలైన అధికార ముద్ర అవుతుంది. ఏది ఏమైనా ఈసారి ఎన్నడూ లేనంతగా పోరు సాగింది. అది భీకరంగానే ఉంది.

జనాలు కూడా అంతే తీరున రెస్పాండ్ అయ్యారు. భారీ ఎత్తున ఓటెత్తారు. దాంతోనే ఫలితం మీద ఒక అయోమయం ఏర్పడింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఎంతో కొంత అంచనా చిక్కింది. ఎగ్జిట్ పోల్స్ లో అదే ప్రభావితం అయింది అని అంటున్నారు. రేపటి ఎగ్జాక్ట్ పోల్స్ వీటిని మ్యాచ్ చేస్తాయా లేదా అన్నది మాత్రం ఆసక్తికరమైన అంశంగానే ఉంది. ఓవర్ టూ జూన్ ఫోర్త్ అన్నదే ఇపుడు అందరి మాటగా ఉంది.