Begin typing your search above and press return to search.

నరాలు తెగే ఉత్కంట వేళ.. వారంతా దూరంగా ఉంటే మంచిదట!

దీంతో.. ఈ ఫలితాల విషయంలో కొందరు దూరంగా ఉండటం వారి ఆరోగ్యానికి చాలా మంచిందంటున్నారు.

By:  Tupaki Desk   |   31 May 2024 5:13 AM GMT
నరాలు తెగే ఉత్కంట వేళ.. వారంతా దూరంగా ఉంటే మంచిదట!
X

గతానికి భిన్నమైన సీన్ ఇప్పుడు ఏపీలో నెలకొంది. రాజకీయ వైరం కొత్త విషయం కానప్పటికీ.. సామాన్య కుటుంబాల్లోకి సైతం ఇది ఎంట్రీ ఇచ్చిన దుస్థితి తాజాగా నెలకొంది. గడిచిన ఐదేళ్లలో పెరిగి పెద్దదైన రాజకీయ వైరం అయినోళ్ల మధ్య కూడా అంతరాల్ని పెంచేస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితంపై తీవ్రమైన ఉత్కంట నెలకొంది. దీంతో.. ఈ ఫలితాల విషయంలో కొందరు దూరంగా ఉండటం వారి ఆరోగ్యానికి చాలా మంచిందంటున్నారు.

భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోని వారు.. అనారోగ్యంతో ఇబ్బంది పడేవారు.. హైబీపీతో పాటు గుండె సమస్యలు ఉన్న వారు.. ఈసారి ఫలితాలకు కాస్త దూరంగా ఉండటం మంచిదంటున్నారు. దీనికి కారణం.. ఈసారి ఎన్నికల ఫలితాల వేళ నాటకీయ పరిణామాలతో పాటు.. నరాలు తెగే ఉత్కంట కొన్ని గంటల పాటు కొనసాగనుంది. దీంతో.. అదే పనిగా టీవీల్లో ఫలితాల్ని చూస్తున్నా.. మొబైల్ లో అప్డేట్స్ కోసం సెర్చ్ చేస్తున్నా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ఇబ్బంది ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

తీవ్రమైన భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ ఫలితాలకు కాస్తంత దూరంగా ఉంటే మంచిదన్న హితవు వినిపిస్తోంది. ఉదయం 7 గంటలకు మొదలయ్యే ప్రక్రియ.. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మొదలు కానుంది. అప్పటి నుంచి మొదలయ్యే రచ్చ మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగనుంది. అంటే.. దాదాపు ఆరు గంటలకు పైనే టెన్షన్ నాన్ స్టాప్ గా ఉంటుంది.

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో ఉత్కంట ఏమైనా ఉంటే.. రెండు ఓవర్లు.. అత్యధికంగా ఐదు ఓవర్లు ఉంటుంది. ఐదు ఓవర్లు అంటే.. ఓవర్ ఆరు నిమిషాలు (యాడ్స్ తో కలుపుకొని) అరగంటే ఉంటుంది. అందుకు భిన్నంగా ఎన్నికల ఫలితాల వేళ ఆరు గంటలు ఉంటుంది. ఇంతసేపు భావోద్వేగాల్ని అదుపులోకి ఉంచుకోవటం.. టెన్షన్ ను నియంత్రించుకోవటం కొందరికి కష్టంగా ఉంటుంది. అదే సమయంలో కొందరు సున్నిత మనస్కులు ఉంటారు.తాము కోరుకున్నట్లుగా ఫలితాలు వెల్లడి కాకుంటే తీవ్రమైన ఆగ్రహం.. మరింత నిరాశ.. నిస్ప్రహలకు గురయ్యే వీలుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

జూన్ నాలుగో తారీఖున ఉదయం ఆలస్యంగా నిద్ర లేవటం.. ఉదయాన్నే టీవీని ఆన్ చేయకుండా.. మొబైల్ నోటిఫికేషన్లను సైలెంట్ మోడ్ లో పెట్టేసి.. టిఫిన్ చేసి ఉదయ్యానే సినిమాకు వెళితే సరిపోతుంది. నగరాల్లోని వారైతే ఉదయాన్నే మల్టీఫ్లెక్స్ లో మూవీకి వెళితే పూర్తిగా డైవర్టు అయ్యే వీలుంది. ఆ టైంలో మొబైల్ ను స్విఛాప్ లో ఉంచితే బెటర్. ఇదంతా కుదరని వారు.. ఆఫీసులకు పక్కాగా వెళ్లాల్సిన వారంతా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎన్నికల ఫలితాలకు సంబంధించి మోతాదుకు మించిన చర్చలోకి వెళ్లకుండా చూసుకోవాలి.

ఫలితాల వెల్లడి వేళ.. కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అనవసరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో టెంపర్ లూజ్ కాకుండా ఉండటం.. నోటికి పని చెప్పే బదులు..పని మీద ఫోకస్ చేస్తే మంచిదని చెప్పాలి. అన్నింటికి మించి రాజకీయంగా విభిన్న భావజాలం ఉన్న వారితో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయంతో జరిగే లాభంతో పోలిస్తే.. వ్యక్తిగతంగా.. వ్రత్తిపరంగా జరిగే నష్టం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది మర్చిపోకూడదు. బీకేర్ ఫుల్.