ఫలితాలకు ముందే దేశం మొత్తం ఏపీ వైపు!... కారణం ఇదే!
ఏపీలో జూన్ 4న వెలువడబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపైనే అందరిదృష్టీ ఉందనే సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 31 May 2024 9:56 AM GMTఏపీలో జూన్ 4న వెలువడబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపైనే అందరిదృష్టీ ఉందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 4న జరగబోయే కౌంటింగ్ కు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సమయంలో గెలుపుపై మిగిలిన పార్టీలు ఆ స్థాయిలో ధీమా కనబరుస్తున్నట్లు కనిపించడం లేదు కానీ... వైసీపీ అధినేత జగన్ మాత్రం గెలుపుపై పూర్తి ధీమాగా ఉన్నారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి!
పోలింగ్ ముగిసిన తర్వాత ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. రాబోయే ఎన్నికల ఫలితాలపై తనకున్న అంచనాలను ప్రకటించారు. ఇందులో భాగంగా... 2019లో వచ్చిన 151 సీట్ల కంటే ఎక్కువగానే ఈసారి సాధిస్తామని తెలిపారు. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రధానంగా "వైనాట్ 175" అనే అంశాన్ని ఎత్తుకున్నారు. తమకు ఎందుకు 175కి 175 రాకూడదో చెప్పాలంటూ ఎదురు ప్రశ్నించేవారు.
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా నేరవేర్చామని చెబుతూ.. తనవల్ల మంచి జరిగితేనే తనకు ఓటు వేయమని ధమ్ముగా అడిగారు. దీంతో ఏపీలో కొత్త తరహా రాజకీయాలు మొదలయ్యాయనే చర్చ తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో గెలవడానికి పనికిమాలిన ఫీట్స్ అన్నీ చేయకుండా.. కేవలం తన పాలన నచ్చితేనే ఓటు వేయమని అడగడంపై ప్రశంసల జల్లులు కూడా కురిశాయి.
పైగా ఈసారి ఏపీలో వచ్చిన ఫలితాల అనంతరం దేశం మొత్తం ఇటువైపు చూస్తుందంటూ ఆయన ధీమాగా చెప్పారు. ఈ క్రమంలోనే గతంలో 2019లో గెలిచి మే 30న ప్రమాణస్వీకారం చేసిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ... "ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది" అని పేర్కొన్నారు.
దీంతో.. జగన్ ధీమా పీక్స్ అని అంటున్నారు పరిశీలకులు. తన పాలనపై తనకున్న ధీమా వేరే లెవెల్ అని చెబుతున్నారు. ఈ స్థాయిలో ధీమా వ్యక్తం చేయాలంటే ప్రధానంగా తనపై తనకు నమ్మకం ఉండాలని.. ఆత్మవంచన అనే పదానికి చోటు ఉండకూడదని.. అలాంటప్పుడే ఈ స్థాయి ధీమా తెరపైకి వస్తుందని చెబుతున్నారు.
ఈ స్థాయిలో అధినేతకు ధీమా ఉన్నప్పుడు ఆటోమెటిక్ గా నేతల్లోనూ అ స్థాయి ధీమా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అందుకే... జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లూ మొదలైపోయాయని అంటున్నారు. ఉదయం 9:30 నిమిషాల నుంచి 11:30 నిమిషాల మధ్య ఈ కార్యక్రమ జరిగేలా ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని చెబుతున్నారు. దీంతో... ఫలితాల తర్వాత కాదు, ముందుగానే దేశం మొత్తం ఏపీవైపు చూస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.