Begin typing your search above and press return to search.

ఏపీ ఫైనల్ రిజల్స్ ఇవే !

ఏపీలో హోరా హోరీ పోరు అన్నట్లుగా మొదలైన కధ చివరికి ఏకపక్షం అయింది. టీడీపీ కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధించింది

By:  Tupaki Desk   |   4 Jun 2024 4:57 PM GMT
ఏపీ ఫైనల్ రిజల్స్ ఇవే !
X

ఏపీలో హోరా హోరీ పోరు అన్నట్లుగా మొదలైన కధ చివరికి ఏకపక్షం అయింది. టీడీపీ కూటమి ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధించింది. ఏపీలో ఎన్నికల తుది ఫలితాలు వచ్చేశాయి. టీడీపీ కూటమిని 164 సీట్లు లభించాయి. అలా అద్భుతమైన విజయం టీడీపీ కూటమి ఖాతాలో నమోదు అయింది.

ఇక ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు అన్నది చూస్తే కనుక పొత్తులో భాగంగా మొత్తం 144 సీట్లలో పోటీ చేసిన టీడీపీ అందులో 135 సీట్లు సాధించింది. అంటే తొంబై అయిదు శాతం విజయం అన్న మాట. కేవలం తొమ్మిది సీట్లను మాత్రమే ఆ పార్టీ కోల్పోయింది.

అలాగే కూటమిలో రెండవ అతి పెద్ద పార్టీగా ఉన్న జనసేన మొత్తం 21 సీట్లకు పోటీ చేస్తే 21 సీట్లనూ గెలుచుకుంది. ఇది నూరు శాతం విజయంగా నమోదు అవుతోంది. అలాగే బీజేపీకి 10 సీట్లు ఇస్తే ఎనిమిది సీట్లలో విజయ ఢంకా మోగించింది. అంటే ఎనభై శాతం సక్సెస్ రేటు అన్న మాట.

వైసీపీ మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తే 11 సీట్లను మాత్రమే సాధించింది. ఒక విధంగా వైసీపీకి ఇది దారుణమైన ఓటమిగా చెబుతున్నారు. అదే విధంగా ఏపీలో ఉన్న పాతిక ఎంపీ సీట్లలో టీడీపీ పొత్తులో భాగంగా 17 సీట్లకు పోటీ చేస్తే 16 సీట్లు సాధించింది. ఇక జనసేన రెండు ఎంపీ సీట్లకు పోటీ చేస్తే రెండూ గెలుచుకుంది. బీజేపీ ఆరు ఎంపీ సీట్లకు పోటీ చేస్తే అందులో మూడింటిని గెలుచుకుంది.

వైసీపీ మొత్తం పాతిక ఎంపీ సీట్లకు పోటీ చేస్తే అందులో నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈ విధంగా చూస్తే వైసీపీకి ఎంపీ సీట్లలో సీట్ల షేర్ పదహారు శాతంగా ఉంటే అదే ఎమ్మెల్యే సీట్లలో సీట్ల 5 శాతం షేర్ ని మాత్రమే సాధించడం గమనార్హం.

ఏపీలో ఒక రాజకీయ పార్టీకి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇంతటి పరాభవం ఎపుడూ జరగలేదు. వైసీపీకే ఆ రికార్డు ఉండడం అంటే చరిత్రలో మరచిపోలేనిదే అని అంటున్నారు. ఏది ఏమైనా ప్రజల తీర్పును ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ శిరోధార్యంగా వహించాల్సిందే.