ఏపీ ఎన్నికలపై లేటెస్ట్ సర్వే... వైరల్ రిజల్ట్!
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతోన్న వేళ
By: Tupaki Desk | 29 July 2023 3:43 AM GMTఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతోన్న వేళ... దానికి ఆజ్యం పొస్తూ మరింత రక్తికట్టిస్తోన్నాయి సర్వేలు. ఇప్పటికే విడుదలైన సర్వేల్లో దాదాపు అన్నింటి ఫలితాలు రాబోయే ఎన్నికల్లో జగన్ గెలుపు ఖాయమంటూ చెబుతున్న వేళ... తాజాగా మరో జాతీయ మీడియా సర్వే ఫలితాలు విడుదల చేసింది.
అవును... "ఇండియా టీవీ - సీ.ఎన్.ఎక్స్" జాతీయ న్యూస్ ఛానల్స్ నిర్వహించిన మరో సర్వే ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ప్రస్తుతం ఈ రిజల్ట్స్ వైరల్ గా మారుతోన్నాయి. ఈ ఫలితాలు అటు జగన్ కు, ఇటు చంద్రబాబు కు కూడా గుడ్ న్యూస్ లు చెప్పడం గమనార్హం.
ఇండియా టీవీ-సీ.ఎన్.ఎక్స్. నిర్వహించిన ఒపీనియన్ పోల్ వెల్లడైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న లోక్ సభ స్థానాలకు ఇప్పటికప్పుడు ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే.. పరిస్థితేమిటనేది ఈ పోల్ స్పష్టం చేసింది. కేంద్రంలో అధికారంలో ఎవరు వస్తారనేది కుండబద్దలు కొట్టింది. ఏపీలో పరిస్థితులను వెల్లడించింది!
ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం... కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని, ప్రతిపక్షాల సంకీర్ణ కూటమి "ఇండియా" గట్టి పోటీ ఇవ్వగలుగుతుందని అంచనా వేసింది.
ఆ సంగతి అలా ఉంటే... ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి తిరుగులేదని ఇండియా టీవీ-సీ.ఎన్.ఎక్స్. ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. అవును... రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 18 చోట్ల వైసీపీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధిస్తారని పేర్కొంది. అయితే 2019 ఎన్నికల్లో ఈ నెంబర్ 22 గా ఉంది!
ఇదే సమయంలో అనూహ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కూడా చిన్న సైజు గుడ్ న్యూసే చెప్పింది ఈ సర్వే! ఆ ఫలితాల ప్రకారం.. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఏడు లోక్ సభ స్థానాలను గెలుచుకుంటారని తెలిపింది. అంటే... 2019లో గెలిచిన 3 కంటే మరో నాలుగు స్థానాలు ఎక్కువగా గెలిచే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
ఈ వివరాలను బట్టి అసెంబ్లీ సీట్లను ఒకసారి అంచనా వేద్దాం...! ఒక్కో లోక్ సభ నియోజకవర్గానికి సగటున ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను తీసుకుంటే... 2019లో 22 ఎంపీ సీట్లు గెలిచిన జగన్ 151 అసెంబ్లీ సీట్లు సాధించారు. 22 x 7 = 154 కి దగ్గర దగ్గరగా అన్నమాట.
అదే సూత్రాన్ని ఇప్పుడు అప్లై చేస్తే... ఈసారి వైసీపీకి 18 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని సర్వే స్పష్టం చేస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే... 18 x 7 = 126 కి ఒక సీటు అటో ఒక సీటు ఇటో రావొచ్చన్నమాట. అంటే సీట్ల సంగతి కాసేపు పక్కనపెడితే ఎలా చూసుకున్నా వైసీపీ గెలుపు మరోసారి తధ్యం అని ఈ సర్వే చెబుతుందన్నమాట.
ఇక టీడీపీ విషయానికొస్తే... ఈ సర్వే ఫలితాలు తమ్ముళ్లలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే... ఈసారి సుమారు 7 పార్లమెంట్ సీట్లు టీడీపీ గెలిచే ఛాన్స్ ఉందని సర్వే చెబుతోంది. ఈ లెక్కన చూసుకుంటే... 7 x 7 = 49. అంటే... ఒక సీటు అటు ఇటుగా అసెంబ్లీ సీట్ల విషయంలో ఈసారి చంద్రబాబు హాల్ఫ్ సెంచరీ చేయడం పక్కా అన్నమాట!
ఏపీలో ప్రధాన పార్టీల సంగతి అలా ఉంటే... రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ డకౌట్ అవుతాయని సర్వే అంచనా వేసింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఇండియా టీవీ-సీ.ఎన్.ఎక్స్ ఒపీనియన్ పోల్.. ఏపీలో రాబోయే ఎన్నికల్లో అత్యంత కీలకమైన అంశంగా భావిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం. దీంతో... బహుశా జనసేనను ఏజెన్సీ... మిత్రపక్షం బీజేపీతో కలిపే పరిగణలోకి తీసుకుని ఉందేమో తెలియాల్సి ఉంది!
మరోవైపు... తెలంగాణ విషయానికొస్తే... అధికార బీఆరెస్స్ ఎనిమిది లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని ఇండియా టీవీ-సీ.ఎన్.ఎక్స్. ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఇదే సమయంలో ఆరు లోక్ సభ స్థానాలను గెలుచుకోవడం ద్వారా బిజెపి రేసులో రెండవ స్థానంలో నిలుస్తుందని తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ కేవలం 2 స్థానాలనే గెలుచుకుంటుందని వెల్లడించింది.
వాటిని అసెంబ్లీ స్థానాలుగా అనువదిస్తే... అధికార బీఆరెస్స్ కు 56 అసెంబ్లీ స్థానాలు మాత్రమే లభిస్తాయి. ఫలితంగా 119 మంది సభ్యుల అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 60 కంటే తక్కువగా పడిపోతుందన్న మాట. ఇదే సమయంలో బీజేపీ 42 అసెంబ్లీ స్థానాలు.. కాంగ్రెస్ కేవలం 14 అసెంబ్లీ స్థానాలు సొంతం చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట.
ఇదే సమయంలో ఎంఐఎం మరోసారి హైదరాబాద్ లోక్ సభ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంటుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో... తెలంగాణలో అధికార బీఆరెస్స్ కు 40 శాతం, బీజేపీకి 28 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ కేవలం 23 శాతం ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతుందని తెలిపింది!