ఏపీలో త్రిముఖ పోటీ... వామ్మో ఇన్ని ఈక్వేషన్సా?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో సరికొత్త రాజకీయ సమీకరణలు తెరపైకి వస్తున్నాయి
By: Tupaki Desk | 8 Jan 2024 11:30 PM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో సరికొత్త రాజకీయ సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఫాస్ట్ పై నమ్మకంతో కొంతమంది.. ఫ్యూచర్ పై హోప్ తో మరికొంతమంది.. ప్రజెంట్ ప్రశ్నార్ధకం కాకూడదని ఇంకొంతమంది ఎవరి ప్లాన్స్ వారు వేసుకుంటున్నారని అంటున్నారు. ఈ సమయంలో తెరపైకి వస్తున్న గాసిప్స్ కి పూర్తిభిన్నంగా ప్రాక్టికల్ గా ఆలోచించే రాజకీయ సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోటీ కన్ ఫాం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
అవును... నిన్నమొన్నటివరకూ టీడీపీ కేంద్రంగా సాగుతున్న ఏపీ విపక్ష రాజకీయ పార్టీల్లో సరికొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయని తెలుస్తుంది. ఈ పూటకి గట్టేక్కడానికి జనసేన అయినా, బీజేపీ అయినా, ఆఖరికి కాంగ్రెస్ పార్టీతో అయినా చంద్రబాబు పొత్తుకు రెడీ అవుతున్నారనే చర్చ తెరపైకి వస్తున్న నేపథ్యంలో... ప్రాక్టికల్ గా అలా లేదని అంటున్నారు పరిశీలకులు. అయితే టీడీపీ - జనసేన కూటమి.. లేదా, టీడీపీ - జనసేన - బీజేపీ కలగలిపిన (ఎన్డీయే) కూటమికి ఛాన్స్ ఉండొచ్చని అంటున్నారు.
అంతేతప్ప... టీడీపీ - జనసేన - కాంగ్రెస్ లతో (ఇండియా) కూటమికి ఏమాత్రం అవకాశం ప్రాక్టికల్ గా లేదని.. అదే ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ మనుగడ సైతం మరింత ప్రశ్నార్ధకం అవ్వడంతోపాటు 2018లో తెలంగాణ కాంగ్రెస్ కు వచ్చిన ఫలితాలే రిపీట్ అయ్యే అవకాశలు ఉంటాయని.. జనం ఈ మధ్యకాలంలో కాస్త మోరల్ పాలిటిక్స్ ని పరిశీలిస్తూ పరిగణలోకి తీసుకుంటున్నారని అంటున్నారు.
ఆ సమయంలో ఏపీలో కాంగ్రెస్ + కమ్యునిస్టులు కలిసి పోటీచేసే అవకాశలున్నాయని.. ఆ కలయిక వల్ల మోరల్ గా ఎలాంటి చీత్కారాలు ఉండే అవకాశం ఉండకపోవచ్చని.. అలా పోటీచేస్తే కనీసం నాలుగు చోట్ల అయినా గౌరవప్రదమైన ఓట్లు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమయంలో టీడీపీ - జనసేనతో కలిసి ముందుకు వెళ్లాలంటే బీజేపీనుంచి వస్తున్న అనధికారిక కండిషన్స్ కూడా చర్చనీయాంశం అవుతున్నాయని చెబుతున్నారు.
అందులో భాగంగా జనసేన - బీజేపీ కూటమికి 40+ అసెంబ్లీ, కనీసం 8 లోక్ సభ స్థానాల డిమాండ్ తెరపైకి వస్తుందని తెలుస్తుంది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి బీజేపీవల్ల టీడీపీకి వచ్చే ఓట్ల శాతంలో పెద్ద గొప్ప నెంబర్ ఏమీ రాకపోయినా... సెంటిమెంట్ గా బీజేపీతో కలిసినప్పుడల్ల గెలిచిన పాస్ట్ గుర్తుకు వస్తుందని అంటున్నారు.
మరోపక్క ఏపీలో బీజేపీకి సొంతంగా నాలుగు సీట్లు రావాలన్నీ జనసేనతో పొత్తు ఉండాల్సిందేనని అంటున్నారు. అదే జరగాలంటే... బీజేపీకి కూడా టీడీపీతో కలవాల్సిన అనివార్య పరిస్థితి! అలా అని బీజేపీని కాదని కాంగ్రెస్స్ తో టీడీపీ కలిస్తే 2018 తెలంగాణ జ్ఞాపకాలు ఎలానూ వెంటడతాయి.. అదే సమయంలో నాలుగు రోజుల క్రితమే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జనసేన బీజేపీతో దోస్తీ కట్టింది.
దీంతో తెలంగాణలో బీజేపీతో, ఏపీలో కాంగ్రెస్ తో అంటే... జనసేన తో పాటు వారితో జతకట్టినవారికి సైతం మరింత డ్యామేజ్ జరిగే ప్రమాధం లేకపోలేదు. ఇలా అత్యంత కీలకమైన స్టేజ్ కి వెళ్లిపోయిన ఫజిల్ గేం ని సైతం తలపిస్తున్న ఏపీలో విపక్ష పొత్తుల రాజకీయం ఏలా కొలిక్కి రాబోతుందనేది ఆసక్తిగా మారింది. ఆ పొత్తుల్లో కనిపించే మోరల్స్ కూడా వైసీపీకి వచ్చే మెజారిటీపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు!