Begin typing your search above and press return to search.

ఏపీ ఎన్నికల్లో ముదురు తెలివి మామూలుగా లేదుగా?

అధికారపక్షానికి.. విపక్ష కూటమికి మధ్య నడుస్తున్న రాజకీయ వైరం నేపథ్యంలో.. డబ్బు పంపిణీ కష్టంగా మారింది

By:  Tupaki Desk   |   11 May 2024 4:32 AM GMT
ఏపీ ఎన్నికల్లో ముదురు తెలివి మామూలుగా లేదుగా?
X

ఏపీ ఎన్నికల్లో సిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారపక్షానికి.. విపక్ష కూటమికి మధ్య నడుస్తున్న రాజకీయ వైరం నేపథ్యంలో.. డబ్బు పంపిణీ కష్టంగా మారింది. దీంతో కొత్త తరహా తెలివిని నేతలు ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి తెలివికి తమదైన శైలిలో చెక్ చెబుతున్నారు వారి ప్రత్యర్థులు. ఎన్నికల వేళ తమకు అనుకూలంగా ఓటేయటం కోసం డబ్బు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఒక పార్టీ తరఫు వారు ప్రయత్నిస్తుంటే.. వారికి చెక్ చెప్పేందుకు ప్రత్యర్థులు మరింత తెలివితో అడ్డుకుంటున్నారు. దీంతో.. డబ్బు పంపిణీ రాజకీయ పార్టీలకు కష్టంగా మారింది.

దీంతో కొత్త ఎత్తులకు తెర తీశారు. ఏపీకి చెందిన ఒక పార్టీ వారు ఒకే సీరియల్ కు చెందిన వరుస రూ.10.. రూ.50 నోట్లను ఓటర్లకు పంచి పెడుతున్నారు. ఆ నోట్లను తీసుకొని వారు చెప్పిన చోటుకు వెళితే.. వారికి అందాల్సిన తాయిలాలు అందుతున్న పరిస్థితి. రూ.10 నోటు తీసుకొని వారు చెప్పిన వైన్స్ కు వెళితే..సదరు నోటు తీసుకొని క్వార్టర్ బాటిల్ ఇచ్చేస్తున్నారు.

అదే సమయంలో రూ.50 నోటును తీసుకొని వారు చెప్పిన షాపునకు వెళితే.. బియ్యం బస్తాను అందజేస్తున్నారు. డబ్బులు నేరుగా పంపిణీ చేస్తే.. ఫిర్యాదులు చేసి పట్టించే వీలు ఉండటంతో ఎన్నికల ప్రచారం వేళలోనే.. కూపన్లు .. చిన్న నోట్లను చేతికి ఇస్తున్నారు. వాటిని తీసుకొని.. చెప్పిన చోట్లకు వెళితే.. వారికి అందాల్సిన బహుమతులు అందుతున్నాయి. దీంతో.. వీటిని క్రాక్ చేసేందుకు రాజకీయ పార్టీలు ఏ రోజుకు ఆ రోజు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఏమైనా.. ఇలాంటి ముదర తెలివితేటలు ఏపీ నేతలకే సాధ్యమన్న మాట వినిపిస్తోంది. తరచి చూస్తే.. ఇలాంటివెన్నో సిత్రాలు ఏపీ ఎన్నికల్లో అడుగడుగునా కనిపిస్తున్నట్లుగా చెప్పక తప్పదు.