Begin typing your search above and press return to search.

ఏపీలో మార్చి 6న ఎన్నికలు... కన్ ఫర్మ్...?

అయితే ఏపీలో ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   26 Nov 2023 2:30 AM GMT
ఏపీలో మార్చి 6న ఎన్నికలు... కన్ ఫర్మ్...?
X

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఎపుడు అంటే అంతా ఏప్రిల్ లేదా మే నెలలలో అని భావిస్తున్నారు. ఎందుకు అంటే 2019లో అలాగే జరిగాయి. పైగా లోక్ సభ ఎన్నికలతో అసెంబ్లీ ఎన్నికలు ముడిపడి ఉంటాయి. ఆరేడు దశలుగా దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి.

ఇక 2019లో అయితే మొదటి దశలోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించారు. కానీ ఈసారి ఎన్నో దశలో నిర్వహిస్తారో తెలియదు. ఒకవేళ రెండవ మూడవ దశలో నిర్వహిస్తే ఏప్రిల్ నెలాఖర్ మే మొదటి వారం కూడా కావచ్చు.

అలా చూసుకుంటే మార్చి మధ్యలో నోటిఫికేషన్ రావచ్చు అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి కచ్చితంగా మూడు నెలల సమయం మించి ఉందని భావిస్తున్నారు. వైసీపీ కూడా ఆ విధంగా ఆలోచించుకునే తన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది. ప్రభుత్వం తరఫున చేయాల్సిన పనులను కూడా ఒక క్రమపద్ధతిలో చేయాలని అనుకుంటోంది.

అయితే ఇపుడు రాజకీయ వర్గాలలో సరికొత్త చర్చ సాగుతోంది. అందేంటి అంటే మార్చి 6న ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు అని. అంటే లోక్ సభ ఎన్నికలు కూడా అన్న మాట. అదే జరిగితే ఫిబ్రవరి మొదట్లోనే నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంటుంది.

అలా చూసుకుంటే గట్టిగా రెండు నెలల వ్యవధి కూడా ఉండదు. ఏపీకి ఎన్నికలు అంటే లోక్ సభకు కూడా ఎన్నికలు కాబట్టి కేంద్రంలోని బీజేపీ మోడీ ఎంతమేరకు అలా డిసైడ్ అయ్యారు అన్నది కూడా చూడాలి. అయితే ఏపీలో ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా ప్రచారం జరుగుతోంది.

వివిధ నివేదికల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 2న నోటిఫికేషన్ వెలువడవచ్చునని అంటున్నారు. అలా వస్తేనే తప్పు మార్చి 6న ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండదు.

అయితే లోక్ సభ ఎన్నికలను ముందుకు జరపకుండా మరికొన్ని రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు కూడా జరగనున్నాయన్నది ఒక టాక్. ఈ నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికలు కూడా ఒకేసారి జరగనున్నాయి. దేశవ్యాప్తంగా దశలవారీగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఈ దశల్లో ఒకటిగా చేర్చనున్నారని అంటున్నారు.

సో అలా ఏపీలో మార్చి 6వ తేదీని ఎన్నికల తేదీగా పేర్కొంటున్నారు. అయితే కౌంటింగ్ ఫలితాలు దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రకటించబడతాయి. భారత ఎన్నికల సంఘం లెక్క ప్రకారం చూస్తే అసెంబ్లీ ఫలితాలను విడిగా ప్రకటించరని అంటున్నారు.

అందువల్ల ఏపీకి కొద్ది నెలల ముందు జరిగినా కూడా లోక్ సభ ఎన్నికల తరువాతనే ఫలితాలు వస్తాయా అన్న చర్చ కూడా ఉద్ని. అయితే ఏపీలో ఎన్నికలు జరిగే మార్చి 6వ తేదీని అధికార వైఎస్సార్సీపీ నేతలు నిర్ధారించడం లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని మాత్రమే అంటున్నారు.

అయితే ఏపీలో చూస్తే ప్రభుత్వ పదవీ కాలం జూన్ దాకా ఉంది. అంటే ఆ లోగానే కొత్త ప్రభుత్వం ప్రమాణం చేయాలి. మార్చిలో ఎన్నికలు అంటే మూడు నెలల ముందు నుంచే అధికారం వదులుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉండాలి. అయినా లోక్ సభ ఎన్నికలు కొద్ది దూరంలో ఉంచుకుని ముందస్తు అంటే కుదురుతుందా అన్నదే అతి పెద్ద క్వశ్చన్.