కిటకిటలాడుతున్న గన్నవరం ఎయిర్ పోర్టు!
ఏపీలో ఎప్పుడూ కనిపించని కొత్త సీన్ ఒకటి ఆవిష్క్రతమైంది. దీనికి గన్నవరం ఎయిర్ పోర్టు వేదికగా మారింది
By: Tupaki Desk | 11 May 2024 4:28 AM GMTఏపీలో ఎప్పుడూ కనిపించని కొత్త సీన్ ఒకటి ఆవిష్క్రతమైంది. దీనికి గన్నవరం ఎయిర్ పోర్టు వేదికగా మారింది. ఏపీలో ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఎంత ప్రతిష్ఠాత్మకంగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకునేందుకు ఓటర్లు స్వచ్ఛదంగా వస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఏపీలో తమ ఓటుహక్కును వినియోగించుకోవటానికి వీలుగా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు. వేలాది రూపాయిలు ఖర్చు పెట్టుకొని మరీ ఓటేయటానికి వస్తున్న ప్రయాణికుల వైనం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు ఎన్నో ఎన్నికలు జరిగినా.. ఇలాంటి సీన్ ఇదే తొలిసారిగా చెబుతున్నారు. శుక్రవారం విషయానికి వస్తే.. ఉదయం 7 గంటల నుంచి 8.30గంటల వ్యవధిలో ఐదు విమానాలు రాగా.. అన్నీ విమనాలు ఫుల్ గా ఉన్నాయి. .. ఆ విమానాల్లో గన్నవరం చేరుకున్న ప్రవాసాంధ్రులంతా ఓటు వేయటానికే రావటం ఆసక్తికరమని చెప్పాలి. గన్నవరం ఎయిర్ పోర్టుకు నిత్యం వచ్చే ఢిల్లీ.. హైదరాబాద్.. చెన్నై.. బెంగళూరు విమాన సర్వీసులు గత రెండు రోజులుగా రద్దీగా నడుస్తున్నాయని.. ఇంత ఫుల్ గా ఇటీవల కాలంలో ఎప్పుడూ నడవలేదని చెబుతున్నారు.
సోమవారం పోలింగ్ జరగనుండటంతో మూడు రోజుల ముందే సొంతూళ్లకు వచ్చేస్తున్నారు. గతంలో ఎన్నో ఎన్నికలు జరగటం.. వాటిల్లో లేని కసి.. ఉత్సాహం ఈసారి ఎన్నికల వేళ ఓటర్లలో కనిపించటం ఆసక్తికరంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి వస్తున్న ఓటర్లు ఏ పార్టీకి ఓటేస్తారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. గన్నవరం ఎయిర్ పోర్టు ఇంతటి రద్దీని మొదటిసారి చూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికల రద్దీ వారం క్రితమే మొదలైనట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. వేలాది రూపాయిలు ఖర్చు పెట్టి మరీ సొంతూర్లకు చేరుకుంటున్న వారంతా ఎవరికి ఓటేస్తారు? వీరి ఓట్లు ఎవరికి లాభంగా మారతాయి?ఎవరికి నష్టాన్ని కలుగజేస్తాయన్నదిప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.