ఏప్రిల్ లో ఏపీలో ఎన్నికలు...!?
ఏపీలో ఎపుడు ఎన్నికలు అంటే ఏప్రిల్ లో అని జవాబు వస్తోంది. జరుగుతున్న పరిణామాలు అదే నిజం అంటున్నాయి.
By: Tupaki Desk | 22 Jan 2024 3:54 AM GMTఏపీలో ఎపుడు ఎన్నికలు అంటే ఏప్రిల్ లో అని జవాబు వస్తోంది. జరుగుతున్న పరిణామాలు అదే నిజం అంటున్నాయి. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇదే విషయం చెబుతున్నారు. ఏపీతో పాటు తెలంగాణాకు ఒకేసారి ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని ఆయన తాజాగా ప్రకటించారు
ఏప్రిల్ మొదటివారంలోనే ఏపీ తెలంగాణాలోని మొత్తం 42 ఎంపీ సీట్లకు ఒకే సారి ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు. అదే టైం లో ఏపీలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. కిషన్ రెడ్డి చెప్పారు అంటే అందులో కొంత ఆధారం సహేతుకత లాజిక్ ఉంటాయి కాబట్టి ఈ ముహూర్తం ఖరారు అనే అనుకోవచ్చు.
గతసారి అంటే 2019లో ఏప్రిల్ 11న ఏపీలో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఆ తరువాత వారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇలా ఏపీలో ఎన్నికల పర్వం అంతా ఒక నెల పాటు సాగింది. ఈసారి కూడా అలాగే జరగనుంది అని అంటున్నారు. ఏపీ నుంచి మొదలెట్టి దేశంలో ఎనిమిది దశలుగా ఈసారి ఎన్నికలు నిర్వహిస్తారు అని అంటున్నారు.
గతసారి జరిగినట్లుగా ఏప్రిల్ 11న కాకుండా కొద్ది రోజులు ముందుకు ఎన్నికలు జరగవచ్చు అని అంటున్నారు. అలాగే మార్చి నెల మొదట్లో కానీ ఫిబ్రవరి చివరిలో కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఒక విధంగా చూస్తే ఎన్నికల నగరా ఏపీలో మోగడానికి గట్టిగానెల రోజుల టైం మాత్రమే ఉంది అని అంటున్నారు.
ఇదిలా ఉండగా ఏపీలో అపుడే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల హడావుడిలో పడిపోయాయి. బయటకు చెప్పడంలేదు కానీ టీడీపీ జనసేన కూడా అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీతో ఉన్నాయని అంటున్నారు. అలాగే ఏపీలో మొత్తం ప్రధాన పార్టీల అధినేతలు సభలు సమావేశాలకు సంబంధించి కూడా షెడ్యూల్ రెడీ అవుతోంది.
ఏప్రిల్ లో ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం అన్నది కూడా ఒక చర్చ. గతసారి ఇదే ఏప్రిల్ లో ఎన్నికలు జరిగితే చంద్రబాబు అధికారాన్ని పోగొట్టుకున్నారు. ఇపుడు వైఎస్ జగన్ అధికారంలో ఉన్నారు. మరి ఏపీ ప్రజలు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇస్తారో కూడా ఇంకా తెలియని పరిస్థితి ఉంది.
ఎన్నికల గడువు ఇంకా ఎంత ఎక్కువ పెరిగితే అంత ఇబ్బంది అధికారంలో ఉన్న పార్టీకే ఉంటుంది అన్నది కూడా వాస్తవం. తొందరగా ఎన్నికలు జరిగితే మేలు అన్నది అధికారంలో ఉన్న వారి ఆలోచన అని చెబుతున్నారు. అలా చూసుకుంటే కనుక ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే జరుగుతున్నాయి. దేశమంతా ఎన్నికలు జరిగి అవి ముగిసి ఫలితాలు వచ్చే నాటికి మే నెల చివరి దాకా అవుతుంది అని అంటున్నారు.
కో వైపు చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఏపీలో పర్యటించినప్పుడు వైసీపీ వారికి వినతి చేసుకుంది. డబులు ఓటింగ్ లేకుండా నిరోధించాలని. అలాగే ఏపీకి తెలంగాణాకు కలిపి ఒకేసారి ఎన్నికలు పెట్టాలని. ఇపుడు అదే జరుగుతోంది అని అంటున్నారు. ఇది కూడా ఎవరికి ఎంత వరకు లాభం ఎంతవరకూ ఏ పార్టీ మీద ప్రభావం చూపిస్తుంది అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.