Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ స‌రే.. వీరి మాటేంటి? కూట‌మి లైట్ తీసుకుందా?

ఏపీలో అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న టీపీపీ-జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి.. సీఎం జ‌గ‌న్‌ను బ‌లంగా ఎదుర్కొంటోంది

By:  Tupaki Desk   |   19 April 2024 11:21 AM GMT
జ‌గ‌న్ స‌రే.. వీరి మాటేంటి?  కూట‌మి లైట్ తీసుకుందా?
X

ఏపీలో అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న టీపీపీ-జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి.. సీఎం జ‌గ‌న్‌ను బ‌లంగా ఎదుర్కొంటోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల‌కుండా చాలా జాగ్ర‌త్త‌లే తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో బ‌ల‌మైన ప్ర‌చారం చేస్తూ.. బ‌ల‌మైన నాయ‌కుల‌ను కూడా రంగంంలోకి దింపింది. భారీ ఎత్తున విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా కూడా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఓకే ఇంత వ‌ర‌కు కూట‌మి ప్లాన్ బాగానే ఉంది. కానీ, ఇక్క‌డే పెద్ద చిక్కు వ‌చ్చింది. తొలిరోజు రాష్ట్రంలో నామినేష‌న్ల ప‌ర్వం గురువారం ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలో అసెంబ్లీకి, పార్ల‌మెంటుకు అనేక మంది నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. పార్ల‌మెంటుకు గురువారం లెక్క‌ల ప్ర‌కారం 43 మంది, అసెంబ్లీకి 236 మంది నామినేష‌న్లు వేశారు. అయితే.. వీరిలో ప్ర‌ముఖులు, ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్తుల కంటే కూడా.. ఇండిపెండెంట్లు ఎక్కువ‌గా ఉన్నారు.

అంతేకాదు.. బీఎస్పీ, తుల‌సి పార్టీ, పిర‌మిడ్ పార్టీ, ప్ర‌జాశాంతి పార్టీ.. మ‌రికొన్ని చిన్నా చిత‌కా పార్టీల అభ్య‌ర్థులు భారీ ఎత్తున నామినేష‌న్లు వేశారు.అంతేకాదు.. అభ్య‌ర్థుల పేర్లు ఒకే విధంగా ఉన్న నియోజ‌క‌వ ర్గాలు నాలుగు నుంచి ఆరు ఉన్నాయి. అభ్య‌ర్థుల ఇంటిపేర్లు ఒకే విధంగా, గుర్తులు దాదాపు ఒకే విధంగా (ఉదాహ‌ర‌ణ‌కు గ్లాసు-బ‌క్కెట్‌) ఉన్న‌వి కూడా క‌నిపించాయి.

ఇక‌, వీరు ప్ర‌చారంలోనూ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తు న్నారు. వీరు గెలుస్తార‌ని చెప్ప‌లేం కానీ.. కూట‌మి ఓటు బ్యాంకుపై మాత్రం ఖ‌చ్చితంగా ప్ర‌భావం చూపించ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. మ‌రి వీరిని లైట్ తీసుకున్నారా? లేక‌.. అస‌లు ప‌ట్టించుకోలేదా? అన్న‌ది ప్ర‌శ్న‌. చూడాలి.. కూట‌మి వ్యూహం ఎలా ఉంటుందో.