Begin typing your search above and press return to search.

రంగంలోకి స‌ర్వే రాయుళ్లు.. నోటిఫికేష‌న్ ముందే ఇలా..!

గ‌త ఏడాది జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ముందుగానే స‌ర్వే ఫ‌లితాలు వ‌చ్చాయి

By:  Tupaki Desk   |   2 Feb 2024 5:48 AM GMT
రంగంలోకి స‌ర్వే రాయుళ్లు.. నోటిఫికేష‌న్ ముందే ఇలా..!
X

రంగంలోకి స‌ర్వే రాయుళ్లు దిగిపోయారు. జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల స్థాయి వ‌ర‌కు.. ప‌దికి పైగా స‌ర్వే లు చేసే సంస్థ‌లు.. ఏపీపై వాలిపోయాయి. వీటిలో కొన్ని స్వ‌చ్ఛందంగా ఉన్న‌వి ఉండ‌గా.. మ‌రికొన్ని అను బంధ సంస్థ‌లుగా ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ స‌ర్వేలు స‌ర్వేలే కాబ‌ట్టి.. వాటి ప్ర‌భావం ఎన్నిక‌ల‌పై ఉంటుం ద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్‌కు ముందుగానే ఈ స‌ర్వేలు త‌మ త‌మ తొలి స‌ర్వే ఫ‌లితా లు వెల్ల‌డించే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది.

గ‌త ఏడాది జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ముందుగానే స‌ర్వే ఫ‌లితాలు వ‌చ్చాయి . అయితే.. అవ‌న్నీ.. అధికార పార్టీకి అనుకూలంగా రావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం ప‌డు తుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేశాయి. ఇక‌, ఎన్నిక‌ల త‌ర్వాత‌.. మ‌రిన్ని సంస్థ‌లు త‌మ ఫ‌లితాలు వెల్ల‌డించాయి. వీటిలో ఒక‌టి రెండు ప‌క్కాగా నిజం కూడా అయ్యాయి. ఇప్పుడు ఈ పంథాలో ఏపీలో ముంద‌స్తు స‌ర్వేలు చేసేందుకు చాణ‌క్య‌, ఏబీపీ స‌ర్వే (గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో వ‌చ్చిన కొత్త సంస్థ‌), టీవీ 9, యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడే, ఓట‌ర్ పల్స్‌, జ‌న్ టాక్‌ త‌దిత‌ర కీల‌క సంస్థ‌లు స‌ర్వేలు ప్రారంభించాయి.

ప్ర‌స్తుతం ఇప్ప‌టికే కొన్ని సంస్థ‌లు గ్రామీణ స్థాయిలో స‌ర్వేలు ప్రారంభించిన‌ట్టు స‌మాచారం. రాష్ట్రంలో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు.. ముఖ్యంగా వైఎస్ ష‌ర్మిల ఎంట్రీతో జ‌ర‌గ‌బోయే ప‌రిణామాలు, జ‌న‌సేన‌-టీడీపీ పొత్తు వంటి కీల‌క అంశాల‌పై ప్ర‌జ‌ల‌కు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నాయి. అదేస‌మ‌యంలో బీజేపీ ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే బాగుంటుంద‌ని.. సీఎం అభ్య‌ర్థులుగా వైఎస్ జ‌గ‌న్‌, చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఎవ‌రు ఉంటే.. బాగుంటుంద‌ని కూడా స‌ర్వేల్లో ప్ర‌శ్నిస్తున్నారు.

మ‌రీ ముఖ్యంగా విభ‌జ‌న హామీలు ప్ర‌స్తుతం తెర‌మీదికి రావ‌డ‌.. ప్ర‌త్యేక హోదా వంటివి కీల‌క అంశాలుగా ప్ర‌చారంలో ఉన్న ద‌రిమిలా.. వాటిపైనా స‌ర్వేలు ఫోక‌స్ పెంచాయి.ఇక‌, ప‌థ‌కాలు.. సంక్షేమం, అదేవిధంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వివిధ పార్టీలు ఇప్ప‌టికే ప్ర‌క‌టించి ఉచిత బ‌స్సులు.. విద్యుత్, గ్యాస్ వంటివికూడాస‌ర్వేల‌కు ప్ర‌ధాన వ‌న‌రుగా మారాయి. మొత్త‌గా జ‌నంనాడిని ప‌ట్టుకునే ప్ర‌క్రియ‌ను స‌ర్వేలు తీవ్ర త‌రంచేశాయి. షెడ్యూల్ రాక‌కు ముందే.. అంటే.. ఈ నెల 15 త‌ర్వాత నుంచి రెండు ద‌శ‌ల్లో ఈ స‌ర్వే ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.