Begin typing your search above and press return to search.

1924గా.. 2024గా.. ఏ దిశ‌గా ఎన్నిక‌లు.. కిడ్నాపులు.. దాడులు.. హింస‌!

1924లో ఎన్నిక‌లు జ‌రిగాయో లేదో మ‌న‌కు తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ, అదిబ్రిటీష్ కాలం.. పైగా రాచ‌రికం ఏలుబ‌డిలో ఉన్న స‌మ‌యం

By:  Tupaki Desk   |   13 May 2024 5:58 AM GMT
1924గా.. 2024గా.. ఏ దిశ‌గా ఎన్నిక‌లు.. కిడ్నాపులు.. దాడులు.. హింస‌!
X

1924లో ఎన్నిక‌లు జ‌రిగాయో లేదో మ‌న‌కు తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ, అదిబ్రిటీష్ కాలం.. పైగా రాచ‌రికం ఏలుబ‌డిలో ఉన్న స‌మ‌యం. సో.. జ‌రిగినా.. అకృత్యాలు జ‌రిగి ఉంటాయ‌ని అంటారు. కానీ, ఇప్పుడు మ‌నం 2024లో ఉన్నాం. అధునాత సాంకేతిక వ్య‌వ‌స్థ అందుబాటులో వ‌చ్చింది. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. చిటికెలో తెలిసిపోయేలా ప‌రిస్థితులు అందుబాటులో వ‌చ్చాయి. అయినా.. ప‌రిస్థితిలో మార్పు క‌నిపించ లేదు. ఎన్నిక‌ల సంఘం ఎన్ని చర్య‌లు చేప‌ట్టినా.. ల‌క్ష‌ల సంఖ్య‌లో కేంద్ర బ‌ల‌గాల‌ను మోహ‌రించినా.. బుట్ట‌బొమ్మ‌ల మాదిరిగా వారు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌తిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

దీనికి కార‌ణం.. ఏపీలో ప్రారంభ‌మైన ఎన్నిక‌ల కీల‌క పోలింగ్ ప్ర‌క్రియ‌లో ప‌లు జిల్లాల్లో కిడ్నాపులు, దాడులు, హింస చోటు చేసుకున్నాయి. పోలింగ్‌బూతుల్లోనే దౌర్జ‌న్యాలు జ‌రిగాయి. ఒక జిల్లాతో ప్రారంభ‌మైన ఈ హింస‌.. ఇప్పుడు ఐదు నుంచి ఏడు జిల్లాల‌కు పాకింది. ఆయా జిల్లాల్లో ప‌రిస్థితి సాధార‌ణ ఓట‌రును భ‌య భ్రాంతుల‌కు గురిచేసేలా త‌యారైంది. దీనిలో ఎవ‌రిది త‌ప్పు అనేది ప‌క్క‌న పెడితే.. యంత్రాంగం ఏం చేస్తున్న‌ట్టు? అనేది మౌలిక ప్ర‌శ్న‌. దీనికి ఎన్నిక‌ల సంఘం ద‌గ్గ‌ర స‌మాధానం లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

ఎక్క‌డెక్క‌డ ఏంజ‌రిగింది?

+ అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలోని ప‌లు బూతుల్లో హింస చోటు చేసుకుంది. ఓ పార్టీకి చెందిన ఏజెంట్ల‌ను మ‌రో పార్టీ నేత‌లు అడుగు కూడా పెట్ట‌కుండా అడ్డుకున్నారు. దాడులు జ‌రిగాయి.

+ పౌరుషాల గ‌డ్డ‌ పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలోని బూతుల్లోనూ ఏజెంట్ల‌పై దాడులు జరిగాయి. ఇద్ద‌రు ఏజెంట్ల‌ను బూతులోకి రాకుండా.. అడ్డుకుని అప‌హ‌రించారని ఆ పార్టీ నేత‌లు ఫిర్యాదు చేశారు.

+ క‌డ‌ప జిల్లాలో సీఎం జ‌గ‌న్ ఓటేసి వ‌చ్చిన త‌ర్వాత‌.. దౌర్జ‌న్యాలు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. చాపాడు మండలం ప‌రిధిలోని ప‌లు బూతుల్లో ఓ పార్టీకి చెందిన ఏజెంట్ల‌పై దాడులు జ‌రిగి.. గాయాలు కూడా అయ్యాయి.

+ అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలంలో కూడా ఇదే ప‌రిస్థితి క‌నిపించింది. ఓ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు బూతును ఆక్ర‌మించే ప్ర‌య‌త్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలింగ్ రెండు గంట‌ల పాటు నిలిచిపోయింది.

+ ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని ఓ బూతులో దౌర్జ‌న్యాలు జ‌రిగాయ‌ని ఓ పార్టీ నాయ‌కుఉ ఆరోపించారు. ఇక్క‌డ ఓ పార్టీకి చెందిన నాయ‌కులు ఓటర్లపై దాడి చేయ‌డంతో క‌ర్ఫ్యూ ప‌రిస్థితి వ‌చ్చింది.

+ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఓ పార్టీ నాయ‌కులు బూతులోకి చొరబడి ఓట్లు వేయించుకున్నారనే ఆరోప‌ణలు రావ‌డంతో తాత్కాకంగా పోలింగ్ ప్ర‌క్రియ‌ను ఆపేశారు.

+ ప్ర‌శాంత‌మైన‌ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోనూ ఈ సారి దౌర్జ‌న్యాలు జ‌రిగాయ‌ని ఎన్నిక‌ల అధికారులు తెలిపారు. ఇక్క‌డ ఓ పార్టీకి చెందిన ముగ్గురు ఏజెంట్ల‌కు గాయాలు కావ‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

+ బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో ఓటేసేందుకు వ‌చ్చిన వ్య‌క్తి.. లైన్‌లో ప్ర‌చారం చేయ‌డం దాడుల‌కు దారితీసింది.

+ పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో ఓ పార్టీ కార్య‌క‌ర్త‌లు.. దౌర్జ‌న్యానికి దిగార‌ని పోలీసులు తెలిపారు. రాడ్లతో మ‌రో పార్టీ నేత‌ల‌పై దాడికి యత్నించ‌డంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.