ఏపీలో పోలింగ్ శాతం గంట గంటకూ పెరిగిందిలా !
ఇదిలా ఉంటే ఏపీలో సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి మొదలైన పోలింగ్ తీరు తెన్నులు చూస్తే కనుక గంట గంటకు అది పెరుగుతూనే ఉంది.
By: Tupaki Desk | 13 May 2024 12:33 PM GMTఏపీలో ఎన్నడూ లేని విధంగా భారీ పోలింగ్ నమోదు అయ్యేలా ఈసారి జనాలు విరగబడి పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. దేశం నుంచి మాత్రమే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఏపీకి వచ్చి ఓటేశారు. ఇదిలా ఉంటే ఏపీలో సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి మొదలైన పోలింగ్ తీరు తెన్నులు చూస్తే కనుక గంట గంటకు అది పెరుగుతూనే ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 175 అసెంబ్లీ పాతిక పార్లమెంట్ సీట్లకు గానూ జరిగిన పోలింగ్ చూస్తే ఉదయం తొమ్మిది గంటలకు 9.21 శాతంగా నమోదు అయినది. 11 గంటలకు 23.04 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 40.26 శాతం, మూడు గంటలకు 55.49 శాతం, సాయంత్రం అయిదు గంటలకు చూస్తే 67.99 శాతంగా పోలింగ్ నమోదు అయింది. ఇంకా గంట సమయం ఉంది. ఆ తరువాత కూడా పోలింగ్ రాత్రి వరకూ సాగనుంది కాబట్టి భారీ పోలింగ్ శాతమే ఈసారి నమోదు అవుతుంది అని అంటున్నారు.
ఇక సాయంత్రం అయిదు గంటల దాకా జిల్లాల వారీగా చూస్తే కనుక అల్లూరి జిల్లాలో 55.17 శాతం, అనకాపల్లి జిల్లాలో 65.97 శాతం,అనంతపురం జిల్లాలో 68.04 శాతం, అన్నమయ్య జిల్లాలో 67.23 శాతం, బాపట్లలో 72.14 శాతం, చిత్తూరులో 74.06 శాతం, కోనసీమలో 73.55 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 67.93 శాతం, ఏలూరులో 71.10 శాతం, గుంటూరులో 65.58 శాతం, కాకినాడలో 65.01 శాతం, క్రిష్ణ జిల్లాలో 73.53 శాతం, కర్నూల్ లో 64.55 శాతం పోలింగ్ జరిగింది.
అలాగే నంద్యాలలో 7143 శాతం, ఎన్టీయార్ జిల్లాలో 67.44 శాతం, పన్లాడు జిల్లాలో 69.10 శాతం, పార్వతీపురం 61.18 శాతం, ప్రకాశం జిల్లాలో 71 శాతం, నెల్లూరు జిల్లాలో 69.95 శాతం, సత్యసాయి జిల్లాలో 67.16 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 67.48 శాతం, తిరుపతిలో 65.88 శాతం, విశాఖపట్నంలో 57.42 శాతం, విజయనగరం జిల్లాలో 68.16 శాతం, పశ్చిమ గోదావరి జిల్లాలో 68.98 శాతం, వైఎస్సార్ జిల్లాలో 72.85 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇంకా పోలింగ్ సాగుతున్నందున ఈ జిల్లాలలో భారీ ఎత్తున పోలింగ్ శాతాలు నమోదు అవుతాయని అంచనా వేస్తున్నారు.