Begin typing your search above and press return to search.

6 అటు 10 ఇటు - ఏపీలో అదే టెన్ష‌న్‌!!

ఏపీలో గ‌త నెల 13న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మి(బీజేపీ+జ‌న‌సేన‌), వైసీపీల మ‌ధ్య పోరు హోరా హోరీగా సాగిన విష‌యం తెలిసిందే

By:  Tupaki Desk   |   2 Jun 2024 3:30 AM GMT
6 అటు 10 ఇటు - ఏపీలో అదే టెన్ష‌న్‌!!
X

ఏపీలో గ‌త నెల 13న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మి(బీజేపీ+జ‌న‌సేన‌), వైసీపీల మ‌ధ్య పోరు హోరా హోరీగా సాగిన విష‌యం తెలిసిందే. నువ్వా-నేనా అన్న‌ట్టుగా అభ్య‌ర్తుల ఎంపిక కూడా చేశారు. మొత్తంగా క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఓట‌ర్లు పోటెత్తారు. 82.37 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌ర్‌గ్రీన్ రికార్డు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర ఆవిర్భ‌వించిన త‌ర్వాత‌.. ఈ రేంజ్‌లో ప్ర‌జ‌లు ఓటేయ‌లేదు. ముఖ్యంగా మ‌హిళ‌లు భారీగా పోటెత్తారు. దీంతో ఎవ‌రికి ఎవ‌రు అనుకూలంగా వేశారు? అనేది బిగ్ క్వ‌శ్చ‌న్‌గా మారిపోయింది. ప్ర‌చారం కూడా ఇరు ప‌క్షాల్లోనూ హోరా హోరీగా సాగ‌డంతో ఎవ‌రు గెలుస్తార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారిపోయింది.

వాస్త‌వ ఫ‌లితాలు.. జూన్ 4న రానున్నాయి. అయితే.. ఈ ఉత్కంఠ‌కు కొంత‌లో కొంతైనా తెర‌దించుతాయ‌ని భావించిన ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితంపై అంద‌రూ ఆశ‌లు పెట్టుకున్నారు. అందుకే జూన్ 4వ తేదీ కంటే కూడా.. జూన్ 1న సాయంత్రం వెల్ల‌డి అయ్యే ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు.. అంచ‌నాల కోసం అంద‌రూ వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూశారు. తీరా అవి వ‌చ్చేశాయి. కానీ, చిత్రం ఏంటంటే.. ఈ ఎగ్జిట్ ఫ‌లితం/అంచ‌నా వ‌చ్చిన త‌ర్వాత కూడా ఏపీలో నెల‌కొన్న టెన్షన్ ఏమాత్రం పోలేదు. పైగా.. మ‌రింత ఉత్కంఠ‌ను పెంచేశాయి. దీనికి కార‌ణం.. మొత్తంగా చేసిన సంస్థలు 20 పైగా ఉంటే.. స‌గం సంస్థ‌లు వైసీపీ కి అనుకూలంగా పోటెత్తితే.. మ‌రో 6 సంస్థ‌లు.. కూట‌మికి అనుకూలంగా అంచ‌నాలు ఇచ్చాయి. దీంతో దేనిని న‌మ్మాల‌నేది ప్ర‌శ్న‌గా మారింది. అంతేకాదు.. వాస్త‌వ ఫ‌లితాన్ని మ‌రింత ఉత్కంఠ‌కు గురి చేసింది.

టీడీపీ కూట‌మి అనుకూలం ఇవే..

రైజ్ = 113-122

జ‌న‌గ‌ళం = 104-118

చాణ‌క్య స్ట్రాట‌జీస్ = 114-125

ప‌య‌నీర్ = 144

పీపుల్స్ ప‌ల్స్ = 111-135

కేకే స‌ర్వేస్ = 161

వైసీపీకి అనుకూలంగా..

ఆరా మ‌స్తాన్ = 94-104

పార్థా చాణ‌క్య = 110-120

ఆత్మ‌సాక్షి = 98-116

రేస్ = 117-128

ఆప‌రేష‌న్ చాణ‌క్య = 95-102

పోల్ స్ట్రాట‌జీ = 115-125

అగ్నివీర్ = 124- 128

పోల్ ల్యాబ్ = 108

జ‌న్మ‌త్ = 95-103

సీపీఎస్ = 97 - 108