ఢిల్లీలో ధర్నాలు.. ఏపీలో ఇదో హిస్టరీ!!
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ.. మాజీ సీఎం జగన్ ధర్నాకు పిలుపునిచ్చారు. వివిధ పార్టీలను కూడా ఆయన ఆహ్వానించారు.
By: Tupaki Desk | 24 July 2024 3:30 PM GMTఢిల్లీలో జరుగుతున్న వైసీపీ ధర్నా గురించి కొంత మేరకు చర్చ జరుగుతోంది. ఏపీలో అధికార మార్పు తర్వాత.. అరాచకం ప్రబలిందని.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ.. మాజీ సీఎం జగన్ ధర్నాకు పిలుపునిచ్చారు. వివిధ పార్టీలను కూడా ఆయన ఆహ్వానించారు. విజయసాయిరెడ్డికి తెలిసిన వారు.. అదేవిధంగా మిధున్ రెడ్డికి పరిచయం ఉన్న కొందరు నాయకులు వచ్చి సంఘీభావం ప్రకటించారు. అయితే.. ఢిల్లీలో ధర్నాలు చేయడం ఏపీకి కొత్తకాదు.
+ రాష్ట్ర విభజనకు ముందు కూడా.. మహారాష్ట్రలోని ఆల్మట్టి రిజర్వాయర్ ఎత్తు పెంచుతున్నారని పేర్కొం టూ.. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి విపక్ష నాయకుడిగా చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేపట్టారు. అప్పట్లో ఆయనకు కూడా కొందరు మద్దతు తెలిపారు. కానీ, ఒరిగింది ఏమీ లేదు.
+ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం.. కేసీఆర్.. ఢిల్లీలో అనేక పర్యాయాలు ధర్నా చేశారు. తర్వాత తర్వాత.. రాష్ట్రాన్ని సాధించారు.
+ ఇక, రాష్ట్ర విభజన తర్వాత కూడా.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక పార్టీలు ఢిల్లీలో ధర్నా చేయడం తెలిసిందే. రాష్ట్రంలో వడ్లు కొనడం లేదని పేర్కొంటూ.. సీఎంగా ఉన్నసమయంలో రెండేళ్ల కిందట కేసీఆర్ ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు.
+ 2018లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని.. ఆరోపిస్తూ.. సీఎంగా ఉన్న చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేశారు. దీనికి కూడా ఆయన ఢిల్లీనే వేదికగా చేసుకున్నారు. అయినా.. కేంద్రం స్పందించ లేదు.
+ 2019 ప్రారంభంలో టీడీపీ ఎంపీలు .. ఢిల్లీలో ధర్నాతోపాటు.. ప్రధాని ఇంటిని కూడా ముట్టడించే ప్రయత్నం చేశారు. అయినా.. ఫలితం లేదు.
+ ఇక, 2019-24 మధ్య మాత్రం ఢిల్లీలో ఏపీ నుంచి ఎవరూ వెళ్లి ధర్నాలు చేయలేదు. ఆ అవసరం రాలేదో.. లేక.. ఏమో ఎవరూ వెళ్లలేదు.
+ ఇప్పుడు మాజీ సీఎం జగన్ తన పరివారంతో ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. కేంద్ర హోం శాఖ స్పందించి రాష్ట్రానికి ప్రత్యేక బృందాలను పంపించాలన్నది విన్నపం. మరి ఏం జరుగుతుందో చూడాలి.