విశాఖ వేదిక గా యంగ్ బ్లడ్ తో జగన్ ఫేస్ టూ ఫేస్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా కాలం తరువాత యంగ్ బ్లడ్ తో డైరెక్ట్ ఇంటరాక్ట్ కాబోతున్నారు
By: Tupaki Desk | 31 July 2023 3:56 AM GMTముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా కాలం తరువాత యంగ్ బ్లడ్ తో డైరెక్ట్ ఇంటరాక్ట్ కాబోతున్నారు. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు యువభేరి పేరిట ఏపీ అంతటా సభలు సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో ఏయూ విద్యార్ధులతో మీటింగ్ పెట్టారు.
మళ్లీ చాలా కాలం తరువాత అదీ సీఎం హోదాలో జగన్ ముఖా ముఖీ భేటీ కాబోతున్నారు. ఆగస్ట్ 1న విశాఖ పర్యటనకు వస్తున్న జగన్ పలు కార్యక్రమాలను ఏయూలో ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగానే యంగ్ బ్లడ్ తో జగన్ ఫేస్ టూ ఫేస్ అవుతున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చి ఏయూలో ఉన్నత విద్యను చాలా మంది చదువుతున్నారు. ఏయూ విద్యా ప్రతిభలో దేశంలోనే ముందు వరసలో ఉంది. ఎన్నో కొత్త కోర్సులను ప్రవేశపెడుతూ ఆకట్టుకుంటోంది.
ఇతర దేశాల నుంచి కూడా ఏయూకి వచ్చి కోర్సులు చదువుతున్న వారు ఉన్నారు. ఇక యంగర్ జనరేషన్ ఎపుడూ దిక్సూచిగానే ఉంటారు. వారి భావాలూ మనోభావాలను పట్టుకుంటే ఎవరైనా హిట్టే. అలాంటి యువతరంతో పొంగెత్తే సాగరకెరటాల సిటీ అయిన విశాఖలో జగన్ భేటీ కాబోతున్నారు అంటే అది విశేషంగానే చూడాలి.
ఇక గతంలో ఏ సీఎం కూడా ఇలా విద్యార్ధులతో ముఖా ముఖీ కాలేదు. జగన్ కూడా నాలుగేళ్లుగా పాలనతోనే తలమునకలు అయి ఉన్నారు. ఆయన పధకాలకు నిధులు విడుదల కోసం మీటింగ్స్ పెడుతునారు. అలా సభలు తప్ప ఆయన నేరుగా జనాలతో ఇంటరాక్ట్ కావడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి.
అలాంటిది ఫస్ట్ టైం జగన్ విశాఖలో ఏయూ కన్వెషన్ సెంటర్ లో విద్యార్ధులతో ముఖా ముఖీ అయితే ఏమి మాట్లాడుతారు, విద్యార్ధులను ఏ విధంగా మోటివేట్ చేస్తారు, వారు సీఎం తో ఏమి చెబుతారు. ఫ్యూచర్ జనరేషన్ ఆశలు ఆకాంక్షలు ఎలా ఉన్నాయి. ఏపీలో పాలన పట్ల వారు ఎలా రియాక్ట్ అవుతున్నారు. సీఎం గా జగన్ పాలన తీరు పట్ల వారు భావన ఎలా ఉంది అన్నది ఎంతో కొంత అయినా బయటకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే జగన్ ఇలా ఫేస్ టూ ఫేస్ అది కూడా ఏయూ విద్యార్ధులు అంటే ప్రొఫేషనల్ కోర్సులలో ఉండే వారితో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఎందుకు పెడుతున్నారు. ఆయన ఆలోచనలు ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తోంది. రేపటి తరం ఆలోచనలను పంచుకోవడంతో పాటు వారి నుంచి అవసరమైన ఫీడ్ బ్యాక్ ని జగన్ తీసుకుంటారా అన్నది కూడా మరో చర్చగా ఉంది.
ఇక ఏయూలో జరిగే ఈ కార్యక్రమంలో రాజకీయాలు లేకపోయినా సీఎం జగన్ లో ఇది కొత్త మార్పుగానే అంతా చూస్తున్నారు. యంగ్ బ్లడ్ తో ఫేస్ టూ ఫేస్ అన్నది మొదలెడితే ఇది ఆరంభం అవుతుందా ఇక్కడ నుంచి జగన్ ఇదే తీరున వివిధ వర్గాలతో ముఖా ముఖీ అవుతారా అన్నది కూడా ఆసక్తిని గొలుపుతోంది. అంతే కాదు జగన్ ఫేస్ టూ ఫేస్ కి విశాఖ వేదిక కావడం సీఎం కలలు కంటున్న పాలనా రాజధాని నుంచే శ్రీకారం చుట్టడం కూడా సరికొత్త ఆలోచనలకు దారితీస్తోంది.