Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... "తల్లికి వందనం"పై సర్కార్ కీలక ప్రకటన..!

ఈ సమయంలో రకరకాల ఊహాగాణాలు తెరపైకి రాగా.. ప్రభుత్వం తాజాగా రియాక్ట్ అయ్యింది.

By:  Tupaki Desk   |   12 July 2024 12:41 PM GMT
బిగ్  బ్రేకింగ్... తల్లికి వందనంపై సర్కార్  కీలక ప్రకటన..!
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత రెండు రోజులుగా "తల్లికి వందనం" పథకం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 2024-25 విద్యా సంవత్సరానికి గానూ 1వ తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్థు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఈ సమయంలో రకరకాల ఊహాగాణాలు తెరపైకి రాగా.. ప్రభుత్వం తాజాగా రియాక్ట్ అయ్యింది.

అవును... "అమ్మకు వందనం", "స్టూడెంట్ కిట్" పథకాల కింద లబ్ధి పొందడానికి ఆధార్ తప్పనిసరిగా కలిగి ఉండాలని ప్రభుత్వం పేర్కొందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది. ఇందులో భాగంగా... "తల్లికి వందనం" పథకం మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించింది. ప్రభుత్వం ప్రకటించే వరకూ ప్రచారాలు నమ్మొద్దని తెలిపింది.

తల్లికి వందనం పథకం కింద రూ.15వేలు రావాలంటే ఇవే మార్గదర్శకాలు అంటూ గత రెండు రోజుగా సోషల్ మీడియాలో జరుగుతున్నది తప్పుడు ప్రచారమని.. దాన్ని నమ్మొద్దని కోరిన ఏపీ పాఠశాల విద్యాశాఖ... ఈ పథకం విధివిధానాలు ప్రభుత్వం రూపొందించిన తర్వాత విడుదల చేస్తామని, అప్పటివరకూ ఎలాంటి అవాస్తవాలూ నమ్మొద్దని సూచించింది. దీంతో... నిన్నమొన్నటివరకూ ఈ పథకంపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ వచ్చినట్లయ్యింది!

కాగా.. గత రెండు రోజులుగా "తల్లికి వందనం" పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, పాఠశాలకు పిల్లల్ని పంపించే తల్లి లేదా సంరక్షకులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం చేయనున్నారు.. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే ఆధార్ ను కలిగి ఉండాలి.. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి.. అనే వార్తలు విపరీతంగా ప్రసారమవుతున్నాయి.

అయితే... ఒక వేళ ఆధార్ కార్డ్ లేకపోయినా ఓటరు గుర్తింపు కార్డు, పాస్ పోర్టు, ఉపాధి పథకం కార్డు, కిసాన్ పాస్ బుక్, బ్యాంక్ లేదా పోస్టాపీస్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన వాటిలో దేన్నైనా అనుమతిస్తారని కూడ పేర్కొన్నారంటూ వార్తలొచ్చాయి. అయితే... అలాంటి వార్తల్ని నమ్మొద్దని, గైడ్ లైన్స్ ఇంకా ఖరారు కాలేదని తాజాగా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.