Begin typing your search above and press return to search.

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ కు సర్కార్ షాక్!

ఇందులో భాగంగా ఇప్పటికే మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీయే అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 July 2024 5:28 AM GMT
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌  కు సర్కార్  షాక్!
X

ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అక్రమ విషయాలపై సీరియస్ గా రియాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలకు నోటీసులు ఇవ్వడం, వాటిని కూల్చివేయడం వంటి కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఇప్పటికే మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీయే అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... విశాఖ, కడపతో పాటు మరికొన్ని జిల్లాల్లోని వైసీపీ కార్యాలయాలకు నోటీసులు పంపించారు అధికారులు. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ఎంపీ నందిగం సురేష్ కు అధికారులు షాకిచ్చారు.

అవును... బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేష్ కు అధికారులు షాకిచ్చారు. ఇందులో భాగంగా.. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయుని పాలెంలో ఆయనకు చెందిన భవనానికి అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల లోపు ఈ నోటీసులకు వివరణ ఇవ్వాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

దీంతో... ఈ నోటీసులపై నందిగం సురేష్ ఎలా రియాక్ట్ అవుతారు, ఎప్పటిలోగా అధికారులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇస్తారు అనేది ఆసక్తిగా మారింది.

కాగా... ఇటీవల నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్ అరెస్టైన సంగతి తెలిసిందే. ఇసుక అక్రమంగా తరలిస్తున్న కేసులో ప్రభుదాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్దండరాయుని పాలెం నుంచి విజయవాడకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని గుర్తించిన పోలీసులు రెండు లారీలను పట్టుకున్నారు. అవి ప్రభుదాస్ వి అని గుర్తించడంతో... తుళ్లూరూ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.