Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ!

ఈ నేపథ్యంలో ప్లాట్ల రద్దు.. సీఆర్డీఏ చట్టం, మాస్టర్‌ ప్లాన్‌ కు విరుద్ధమని ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

By:  Tupaki Desk   |   27 Feb 2024 1:30 PM GMT
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ!
X

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ జగన్‌ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులను కోర్టు కొట్టివేసింది. తద్వారా రాజధాని రైతులకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది.

రాజధాని నిమిత్తం రైతుల నుంచి భూములు సేకరించినందుకు గానూ రైతులకు గతంలో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (1సీఆర్డీఏ) ఈ ప్లాట్లు ఇచ్చింది. వీటిని రద్దు చేస్తూ 862 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో ప్లాట్ల రద్దు.. సీఆర్డీఏ చట్టం, మాస్టర్‌ ప్లాన్‌ కు విరుద్ధమని ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది తాము ఈ మేరకు సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేశామని కోర్టుకు నివేదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. ప్లాట్లను రద్దు చేస్తూ అధికారులు ఇచ్చిన నోటీసులు చెల్లవని తేల్చిచెప్పింది.

రైతుల తరపున న్యాయవాదులు కారుమంచి ఇంద్రనీల్‌ బాబు, ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. వీరి వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. మొత్తం 862 ప్లాట్లను రద్దు చేస్తూ 1సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయం 1సీఆర్డీఏ చట్టం, మాస్టర్‌ ప్లాన్‌ కు విరుద్ధమని రైతుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు సీఆర్డీఏ చట్టంలో మార్పులు తెచ్చామని ప్రభుత్వం తరఫు న్యాయవాది తన వాదన వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ప్లాట్లను రద్దు చేస్తూ సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్‌ ఇచ్చిన నోటీసులు చెల్లవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో నోటీసులు, ప్రొసీడింగ్స్‌ రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, కార్వనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించింది. ఈ మేరకు మూడు రాజధానులను ఏర్పాట్లు చేస్తున్నట్టు జీవోలను కూడా తెచ్చింది. ఈ జీవోలను అమరావతి రైతులు హైకోర్టులో సవాల్‌ గా హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.