ఐపీఎల్ లో ఏపీ జట్టు విషయంలో జగన్ దూకుడు!
ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టును ఐపీఎల్ లో చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని..
By: Tupaki Desk | 16 July 2023 11:30 AM GMTక్రికెట్ ను మతంగా భావించే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అని అంటారు. క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ దేశస్తులతో సైతం ఈ మాట చెప్పించుకోగలుగుతున్నారంటే... భారత్ లో క్రికెట్ స్థాయి స్థానం ఆ స్థాయిలో ఉంటుంది. ఈ సమయంలో ఐపీఎల్ లో ఏపీ టీం విషయంలో ఒక అప్డేట్ తెరపైకి వచ్చిందని తెలుస్తుంది.
అవును... ఏమాత్రం పరిచయం అవసరంలేని టోర్నమెంట్స్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లెవెలే వేరని అంటుంటారు. ఇందులో భాగంగా... ఏడాదికి ఒకసారి జరిగే ఈ టోర్నమెంట్ కోసం అటు క్రీడాకారులు, ఇటు క్రీడాభిమానులూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఈ సమయంలో ఐపీఎల్ లో ఏపీ టీం విషయంలో జగన్ దూకుడు ప్రదర్శిస్తున్నారని తెలుస్తుంది.
ప్రస్తుతం ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అనే పది జట్లు ఉన్న సంగతి తెలిసిందే. వీటి సరసన ఏపీ టీం కూడా చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ను జగన్ ఆదేశించినట్లు సమాచారం.
ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టును ఐపీఎల్ లో చేర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని.. ఈ మేరకు రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)ని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలుస్తుంది. బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీల కోసం విండోను తెరిస్తే.. కొత్త ఫ్రాంచైజీని బిడ్డింగ్ ద్వారా స్వంతం చేసుకోవాలి. దీనికోసం ఇప్పటికే పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఏసీఏ చర్చలు జరుపుతోందని అంటున్నారు.
విషయంలో జగన్ సూచనల మేరకు ఐపీఎల్ లో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టును పొందేందుకు ఏసీఏ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇందులో భాగంగా... ఐపీఎల్ లో ఏపీ జట్టు ఫ్రాంచైజీని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ జట్టును సొంతం చేసుకునేందుకు అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో మాట్లాడుతోందని అంటున్నారు. ఏది ఏమైనా... రాబోయే రోజుల్లో ఐపీఎల్ లో ఏపీ టీం సందడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తుంది.