సీ ఫుడ్ ఎగుమతుల్లో ఏపీ టాప్ ఎన్ని లక్షల టన్నులంటే ?
అవును... 2023-24 ఫైనన్షియల్ ఇయర్ లో భారతదేశ మత్స్య సంపద ఎగుమతుల్లో ఏపీ టాప్ ప్లేస్ లో నిలిచింది.
By: Tupaki Desk | 27 July 2024 7:17 AM GMTమత్స్యసంపద ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్ లో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మత్స్య సంపద ఎగుమతుల్లో దేశం గణనీయమైన అభివృద్ధిని సాధించగా.. అందులో ఆంధ్రప్రదేశ్ పాత్ర కీలకంగా ఉంది. ఫలితంగా... సీ ఫుడ్ ఎగుమతుల్లో గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాళ్ రాష్ట్రాలను దాటి టాప్ ప్లేస్ లో నిలించింది!
అవును... 2023-24 ఫైనన్షియల్ ఇయర్ లో భారతదేశ మత్స్య సంపద ఎగుమతుల్లో ఏపీ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ మొత్తం ఎగుమతులు 18.19 లక్షల టన్నులు ఉండగా.. అందులో కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే 4,27,237.92 టన్నుల సముద్ర ఆహారాన్ని ఎగుమతి చేసినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది.
ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద.. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లో భారత్ నుంచి ఎగుమతి అయిన మత్స్య సంపద 18.19 లక్షల టన్నులు కాగా.. వాటి విలువ రూ.61,043 కోట్లని తెలిపారు.
ఈ క్రమంలోనే 4 లక్షలకు పైగా టన్నుల ఎగుమతితో ఏపీ టాప్ ప్లేస్ లో ఉండగా... ఆ తర్వాత స్థానంలో 3.45 లక్షల టన్నులతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. అదేవిధంగా... 2.73 లక్షల టన్నుల ఎగుమతితో కర్ణాటక మూడో స్థానంలో ఉండగా.. 1.88 లక్షల టన్నులతో కేరళ, 1.70 లక్షల టన్నులతో మహారాష్ట్ర, 1.60 లక్షల టన్నులతో పశ్చిమ బెంగాల్ లు వరుసగా తర్వాత స్థానాల్లో నిలిచాయి!
ఈ సందర్భంగా స్పందించిన మంత్రి... భారతదేశం నుంచి వెళ్లే కంటైనర్ల సెయిలింగ్ లను కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం ద్వారా మళ్లించడం నుంచి ఎగుమతులు కొనసాగుతున్నాయని అన్నారు! సవాళ్లు ఉన్నప్పటీకీ ఎగుమతులు 2022-23 సంవత్సరంలో 17.54 లక్షల టన్నులు ఉండగా.. 20223-24 నాటికి 3.73 శాతం వృద్ధిని సాధిస్తూ 18.19 లక్షల టన్నులకు పెరిగినట్లు వెల్లడించారు.