Begin typing your search above and press return to search.

జగన్ ఓటమి కాదు...కూటమి గెలుపూ కాదు...!

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడింది. టీడీపీ కూటమి గెలిచింది

By:  Tupaki Desk   |   2 July 2024 11:30 AM GMT
జగన్ ఓటమి కాదు...కూటమి గెలుపూ కాదు...!
X

ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడింది. టీడీపీ కూటమి గెలిచింది. అయితే బంపర్ విక్టరీ కొట్టిన కూటమి మీద దారుణంగా ఓడి నేల కరచిన వైసీపీ మీద విశ్లేషణలు పెద్ద ఎత్తున సాగుతూనే ఉన్నాయి. ఎందుకు కూటమికి ఇంత మెజారిటీ వచ్చింది అన్నది విశ్లేషణలకు అందకుండా ఉంటే ఓటమి మరీ ఈ లెవెల్ లో ఉంటుందా అన్నది కూడా విశ్లేషకులకు బోధపడని తీరులోనే ఉంది.

అయితే ఇది జగన్ ఓటమి కాదు, కూటమి గెలుపు కాదు అని మరో విశ్లేషణ సాగుతోంది. ఇది లాజిక్ కి అందేలాగా ఉంది. ఈ విశ్లేషణ ఏంటి అంటే ఏపీలో ప్రజలు ఎపుడూ కొత్త పొలిటికల్ బుక్ నే చదువుతారు అని అంటున్నారు. సంక్షేమ పధకాలు గెలిపిస్తున్నాయన్నది కూడా ఒక ట్రాష్ గా కొట్టి పారేస్తున్నారు.

ఎవరు అధికారంలోకి వచ్చినా నాయకుడు అనేవారు తమకు మర్యాద ఇవ్వాలని ఏపీ ప్రజలు ఎపుడూ కోరుకుంటారు. అంతే కాదు అభివృద్ధి జరగాలని కూడా సదా కోరుకుంటారు. ఇక మద్య నిషేధం వంటి మాటలు అయితే జనాల చెవికి పెద్దగా ఎక్కవు. మంచి మద్యం ఇవ్వాలన్నది కూడా డిమాండ్ గా ఉండడం విశేషం.

ఇక ఏపీ ఏ రాష్ట్రానికి తీసిపోయింది అన్నది కూడా జనాలలో మెదులుతున్న ప్రశ్న. పాలకులు దృష్టి పెట్టాలి కానీ ఏపీని ఫుల్ గా డెవలప్ చేసి అగ్రభాగాన నిలబెట్టవచ్చు అని కూడా అంటున్నారు. అలా చేసి ఎక్కడో జాబ్స్ ఎందుకు ఏపీలోనే తమ పిల్లలకు జాబ్స్ ఇప్పించాలన్నది ఏపీ జనాల కోరికగా ఉంది అంటున్నారు.

ఏపీలో మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని నాయకులు ప్రజలతో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ ఉండాలన్నది ప్రజల కోరిక. ఇక ఈ ఎన్నికల్లో జగన్ ఓడినా కూడా ఆయన సంక్షేమ పధకాలు కింద 2.66 కోట్ల రూపాయలు పంచారు కాబట్టే 40 శాతం ఓటు బ్యాంక్ వచ్చింది. ఇక కూటమిలో ఉన్న టీడీపీకి 45 శాతం ఓటు షేర్ వచ్చింది అంటే చంద్రబాబు మీద ప్రజలలో నమ్మకం ఉండడం, ఆయన అయితేనే ఏపీని అభివృద్ధి చేస్తారు అన్న విశ్వాసం ఉండడమే అనుకుంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా ఆయనకు కూడా పది శాతం పైగా ఓటు షేర్ రావడం అంటే అది పాపులర్ ఓటింగ్ మాత్రమే కాదు సీట్లు కూడా జనసేనకు ఇవ్వాలని వేసిన ఓట్లుగానే చూస్తున్నారు. అమెరికాలో అప్పట్లో జరిగిన ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కి ఓట్లు ఎక్కువగా వచ్చాయి. కానీ ట్రంప్ కి మాత్రం సీట్లు ఎకువగా వచ్చాయి అనేది ఉదహరిస్తున్నారు. అదే విధంగా కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినా సీట్లు మాత్రం కాంగ్రెస్ కి వచ్చాయన్నది గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇలాగే ఉంటుంది.

ఏది ఏమైనా 2024 ఎన్నికలు చాలా పాఠాలు నేర్పాయి. అది జగన్ తో పాటు బాబు కూడా తెలుసుకోవాల్సి ఉంది అని అంటున్నారు. ఏపీ ప్రజలు తెలివైన వారు అని అంటారు. వారు ఎమోషన్స్ తో పాటు అనేక ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇక విలక్షణమైన తీర్పు ఇవ్వడంతో అర్బన్ ఓటర్లకు ఏ మాత్రం రూరల్ ఓటర్లు తీసిపోరు అన్నది అనేక ఎన్నికల్లో రుజువు అయింది.

పైగా ఒకే మైండ్ సెట్ తో అర్బన్ ఓటర్లు రూరల్ ఓటర్లు ఆలోచిసారు. అందుకే పార్టీలకు ల్యాండ్ స్లైడ్ విక్టరీని కట్టబెడతారు. ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా ఒకే రకంగా ప్రభంజనం ఎపుడూ సాగుతుంది. అంతే కాదు ఏపీ ప్రజలు ఎపుడూ బొటా బొటీ మెజారిటీ ఇవ్వలేదు. వార్ వన్ సైడ్ అన్నట్లుగా వారు ఎన్నికలకు చాలా ముందే డిసైడ్ అయిపోతారు. మరో చిత్రమేంటి అంటే ఏపీ ఓటర్లు ఎక్కడా బయట పడరు, నిరసనలు తెలియచేయరు, ఉద్యమాలలో పాలు పంచుకోరు. కానీ తీర్పు చూస్తే చాచి కొట్టినట్లుగా అధికార పార్టీలకు ఉంటుంది.

దాన్ని బట్టి ఎవరు అధికారంలో ఉన్నా ఏపీ ఓటర్లను చాలా ఎక్కువగానే చూడాలి కానీ లైట్ తీసుకుంటే కూసాలు కదలిపోతాయని. వారికి పార్టీల కంటే తమ ఆలోచనలను ఆకాంక్షలను నెగ్గించడమే తెలుసు. అందుకే పార్టీలు ఓటమి చెందవచ్చు. ఏపీ ఓటర్లు మాత్రం ఎపుడూ గెలుస్తూనే ఉంటారు అన్న సత్యం అంతా తెలుసుకోవాలి.